ETV Bharat / state

నిత్యావసర వస్తుల ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్ష - CM CHANDRABABU NAIDU REVIEW

నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం

CM_Chandrababu_Naidu_Review
CM Chandrababu Naidu Review (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 12, 2024, 3:11 PM IST

Updated : Oct 12, 2024, 4:36 PM IST

CM Chandrababu Review on Civil Supplies: నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా సాధ్యమైనంత వరకు ప్రజలపై నిత్యావసరాల భారం పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. డిమాండ్-సప్లై మధ్య వ్యత్యాసానికి గల కారణాలను విశ్లేషించి తగు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

నిత్యావసర వస్తువుల ధరల భారం ప్రజలపై పడకుండా పౌరసరఫరాల శాఖ తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్షించారు. ధరలు పెరిగిన తరువాత తగ్గించే ప్రయత్నం చేయడం, సబ్సిడీలో అందించడం కంటే, మూడు శాఖలు నిరంతర పర్యవేక్షణ ద్వారా ధరల పెరుగుదలను ముందుగానే గ్రహించి అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తే ఫలితాలు వస్తాయని సూచించారు. నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను సీఎంకు అధికారులు వివరించారు.

మద్యం టెండర్లలో జోక్యం సహించేది లేదు - కక్షలు తీర్చుకునే స్వభావం నాది కాదు : సీఎం చంద్రబాబు

నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలకు, తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రులు నాదెండ్ల మనోహర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆన్లైన్ విధానంలో హాజరయ్యారు. ప్రస్తుతం రైతు బజార్లలో కౌంటర్ల ద్వారా చేపట్టిన అమ్మకాలపై సమీక్షలో వివరించారు. పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, కందిపప్పు, టమాటా, ఉల్లిపాయలు రైతు బజార్​లలో కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ ధర కంటే 10 నుంచి 15 తక్కువకు అమ్మకాలు చేస్తున్నట్లు తెలిపారు.

విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ క్రియాశీలకంగా పనిచేయాలని, వ్యాపారులు కూడా సహకరించేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. బ్లాక్ మార్కెటింగ్​కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన రాష్ట్రంలో పామాయిల్, కూరగాయలు, పప్పుల వంటి ఉత్పత్తులు పెంచేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. పెద్ద ఎత్తున గిడ్డంగులను అందుబాటులోకి తేవడం ద్వారా రైతులకు, వినియోగదారులకు కూడా న్యాయం చేయవచ్చని సీఎం సూచించారు. ధరల నియంత్రణ విషయంలో ప్రజలకు ఉపశమనం కల్పించేలా చర్యలు ఉంటేనే వారు హర్షిస్తారని, ఆ స్థాయిలో అధికారులు ప్రణాళికలను అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.

రేషన్​కార్డుదారులకు గుడ్​న్యూస్​ - ఇక తక్కువ ధరకే వంటనూనెలు

Last Updated : Oct 12, 2024, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.