ETV Bharat / state

పోలవరం పూర్తికి నాలుగేళ్లు పడుతుందని అధికారులు అంటున్నారు- సీఎం చంద్రబాబు - AP CM Chandrababu on Polavaram

AP CM Chandrababu: పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 72 శాతం ప్రాజెక్టు పూర్తి చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP CM Chandrababu
AP CM Chandrababu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 17, 2024, 4:07 PM IST

Updated : Jun 17, 2024, 6:03 PM IST

Key Decision On Polavaram Project: ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పొలవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలు ఎదుర్కొందని పేర్కొన్నారు. ఏడు మండలాలు వచ్చినందునే ప్రాజెక్టు మొదలుపెట్టామన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారని వెల్లడించారు. పోలవరం పూర్తి అయితే, రాయలసీమకు కూడా గోదావరి జలాలు తీసుకెళ్లే పరిస్థితి వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 72 శాతం ప్రాజెక్టు పూర్తి చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టారని దుయ్యబట్టారు. ఏజెన్సీతో పాటు సిబ్బందిని కూడా మార్చారని విమర్శించారు. డయాఫ్రమ్‌ వాల్‌ను గత ప్రభుత్వం కాపాడుకోలేదని, రూ. 446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదని తెలిపారు. సమాంతరంగా డయాఫ్రమ్‌ వాల్‌ కడితే రూ.990 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. గతంలో ప్రాజెక్టు కొనసాగి ఉంటే 2020 చివరినాటికి పూర్తయ్యేదని తెలిపారు. పోలవరం పూర్తికి 4 సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారని, అన్నీ సవ్యంగా జరిగితేనే నాలుగేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారని చంద్రబాబు తెలిపారు.

పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణకు చంద్రబాబు వ్యూహం- అధికారులకు స్పష్టమైన ఆదేశాలు - CM Chandrababu vision

నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని భావించామన్నారు. ఏజెన్సీని మార్చవద్దని కేంద్రం రాష్ట్రానికి చెప్పిందని గుర్తుచేశారు. ఏజెన్సీని మారిస్తే ప్రాజెక్టుకు జవాబుదారీతనం ఉండదని చెప్పారని, అయిప్పటికీ ఏజెన్సీని మార్చారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదో ఇదొక కేస్‌ స్టడీ అని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం ప్రజెక్ట్​ పేరుతో రూ.వేల కోట్ల ప్రజాధనం వృథా జరిగిందని వెల్లడించారు. అప్పుడే ప్రాజెక్టు చేపడితే తక్కువ ఖర్చుతో పూర్తయ్యేదన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పెరిగిందని, నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అంతకు ముందు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌, డయాఫ్రమ్‌ వాల్‌ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్‌బండ్‌ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. 22, 23 గేట్ల నుంచి ప్రాజెక్టు పరిసరాలను చూశారు. పరిశీలన అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

పోలవరం పరిస్థితి ఏంటి?- నేడు ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం - CM Chandrababu Visit to Polavaram

పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం (ETV Bharat)

Last Updated : Jun 17, 2024, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.