ETV Bharat / state

కలవడానికి వస్తే అవమానిస్తారా - ఓడినా బుద్ధి మారలేదు : జగనన్నపై కార్యకర్తలు ఆగ్రహం - Clash at YS Jagan House - CLASH AT YS JAGAN HOUSE

Clash at Former CM YS Jagan Residence in Tadepalli: ఏపీ మాజీ సీఎం జగన్‌ని కలిసేందుకు వెళ్లిన ఆ పార్టీ కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. సమస్యలతో వచ్చిన వారికి ఆర్థిక సాయం అందిస్తారని వైఎస్సార్​సీపీ నాయకులు ప్రచారం చేసారు. దీన్ని నమ్మి కార్యకర్తలు జగన్‌ను కలవడానికి పెద్ద ఎత్తున తాడేపల్లిలోని జగన్ నివాసానికి తరలివచ్చారు. కాని అక్కడ జగన్ భద్రతా సిబ్బంది కార్యకర్తలను బయటకు నెట్టేశారు.

Clash at Former CM YS Jagan
Clash at Former CM YS Jagan Residence in Tadepalli (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 9:33 PM IST

Clash at Former CM YS Jagan Residence in Tadepalli AP : ఏపీలోని తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం వద్ద తోపులాట జరిగింది. వైఎస్సార్​ససీపీ అధ్యక్షుడు జగన్‌ని కలిసేందుకు వెళ్లిన ఆ పార్టీ కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. సమస్యలతో వచ్చిన వారిని జగన్‌ స్వయంగా కలిసి ఆర్థిక సాయం అందిస్తారని వైఎస్సార్​సీపీ నాయకులు ప్రచారం చేశారు. దీన్ని నమ్మి వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు జగన్‌ను కలవడానికి తాడేపల్లిలోని ఆయన నివాసానికి తరలివచ్చారు. గేటు బయట నుంచి 'రావాలి జగన్‌ రావాలి జగన్‌' అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో జగన్‌ వ్యక్తిగత సిబ్బంది ప్రవర్తన కార్యకర్తలకు అసహనం తెప్పించింది. జగన్‌ సాయం చేస్తారని ఆశగా వచ్చిన ఓ కార్యకర్త సెల్‌ ఫోన్‌ని వ్యక్తిగత సిబ్బంది లాక్కుని విసిరేశారు. కార్యకర్తలను బయటకు నెట్టేశారు.

ఐదేళ్లుగా ఎవరు వచ్చినా జగన్‌ని కలవనివ్వకుండా చేయడం వల్లే ఓడిపోయామంటూ కొంతమంది కార్యకర్తలు వ్యాఖ్యానించారు. దీంతో వ్యక్తిగత సిబ్బంది, కార్యకర్తల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. జగన్ ఇంటివద్ద తమకు ఎదురైన అనుభవంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్లే ఎన్నికల్లో జగన్ ఓడిపోయారని కార్యకర్తలు మండిపడ్డారు. ఒడినా బుద్ధి మారలేదని ఆగ్రహంతో భద్రతా సిబ్బందిని తిట్టారు. అవమానించారంటూ కార్యకర్తలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అసహనంతో వెళ్లిపోయారు.

సమస్యలు ఉంటే తీరుస్తామని వైఎస్సార్​సీపీ నేతలు మాతో చెప్పారు. మేము కూడా మా సమస్యలు తీరుతాయని జగన్ ఇంటి వద్దకు వచ్చాము. ఎలాగైనా జగన్​ను కలిసే వెళ్దామనుకున్నాం. కానీ సెక్యురిటీ నన్ను కొట్టారు. కొట్టి బయటకు గెంటేశారు.- కార్యకర్త

యూసుఫ్ పఠాన్​ అరెస్ట్ - వల్లభనేని వంశీ కోసం గాలింపు - Ex MLA Vallabhaneni Vamsi Arrest

ఏపీ డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్​తో యూఎస్ కాన్సుల్ జనరల్ భేటీ - andhrapradesh latest news

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.