ETV Bharat / state

నానమ్మకు సివిల్స్​ ర్యాంక్ బహుమానం - మాజీ కానిస్టేబుల్​ విజయం - Civils Ranker Uday Krishna Reddy - CIVILS RANKER UDAY KRISHNA REDDY

Civils Ranker Uday Krishna Reddy : చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఓ యువకుడు పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. కూరగాయలు అమ్ముతూ పెంచి పెద్ద చేసిన నాయనమ్మ కష్టానికి మంచి బహుమానం అందించాడు. సివిల్స్‌లో మంచి ర్యాంక్​ సాధించి నానమ్మ పెదాలపై నవ్వులు పూయించాడు.

UPSC Ranker Ongole District
Civils Ranker Uday Krishna Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 17, 2024, 4:24 PM IST

Civils Ranker Uday Krishna Reddy : ఐదేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ యువకుడు పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. చిన్నా చితకా పనులు చేస్తూ, కూరగాయలు అమ్ముతూ పెంచి పెద్ద చేసిన నాయనమ్మ కష్టాన్ని నిత్యం గుర్తు చేసుకుంటూ పుస్తకాలతో కుస్తీ పట్టారు. తొలిసారి కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించి ఇంటి బాధ్యతలు చూసుకున్నాడు.

ఇప్పుడు ఏకంగా సివిల్స్‌లో 780వ ర్యాంకు సాధించి, తనను పెంచి పోషించిన నానమ్మ కళ్లలో వెలుగులు నింపాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి ప్రస్థానమిది. భర్తతోపాటు కుమారుడు, కోడలు మృతి చెందినప్పటికీ రమణమ్మ తన మనవళ్ల చదువు కోసం చెమటోడ్చి, వారి జీవితాలకు అక్షర బాటలు వేసి ఉన్నత శికరాలధిరోహించేెంది చేయూతనందించింది.

ఎంచుకున్న లక్ష్యంపై దృష్టి - మొక్కవోని దీక్షతో సివిల్స్​లో విజయం - AP CANDIDATES IN UPSC CIVILS

UPSC Result 2024 Andhra Pradesh : మనవడు ఉదయ్‌కృష్ణారెడ్డిని స్వగ్రామంలోనే స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివించింది రమణమ్మ. నెల్లూరు జిల్లా కావలిలోని ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌, డిగ్రీ చేస్తున్న రోజుల్లో సెలవుల్లో నాయనమ్మకు చేదోడుగా ఉంటూనే మంచి మార్కులతో గ్రాడ్యుయేషన్​ పూర్తి చేశాడు ఉదయకృష్ణ. 2012లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించి 2019 వరకు విధులు నిర్వహించారు.

తరువాత కొన్ని రోజులకు ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌ శిక్షణ కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. మూడు ప్రయత్నాల్లోనూ విఫలమైనప్పటికీ ఆత్మవిశ్వాసం సడలకుండా నాలుగోసారి ప్రయత్నించారు. ఈ సారి ఉత్తమ ర్యాంకు సాధించి ప్రతిభ చాటుకున్నాడు. ఈ ర్యాంక్​తో ఉదయకృష్ణ ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యే అవకాశముంది. ఆయన సోదరుడు కూడా సివిల్స్‌ ప్రయత్నాల్లో ఉన్నారు.

యూపీఎస్సీ తుది ఫలితాలు విడుదల - సత్తా చాటిన తెలుగు తేజాలు - UPSC CIVILS RESULTS

తల్లిదండ్రులు కోల్పోయిన మాకు నానమ్మే అండగా ఉంది, ఆమె చెమటోడ్చి మాకు చదువులు చెప్పించింది. నేను కష్టపడి చదువుకున్నాను. ఎంతో పట్టుదలతో కోచింగ్​లో చేరాను, మూడు సార్లు పరీక్షల్లో విఫలమయ్యాను. అయినా ఆత్మ స్థైర్యం కోల్పోకుండా మరో సారి ప్రయత్నించాను. ఈ సారి ఉత్తమ ర్యాంక్​ అందిపుచ్చుకున్నాను. నానమ్మ ఎంతగానో సంతోషించింది. ఆత్మ విశ్వాసంతోనే ఏదైనా సాధించగలుగుతాం, ప్రతీ ఒక్కరూ లక్ష్య సాధన కోసం కష్టపడితో ఏదే ఒక రోజు విజయం మీ సొంతం అవుతుంది -ఉదయకృష్ణ, సివిల్స్​ 780వ ర్యాంకర్​

జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం - నాలుగురోజుల్లో ముగియనున్న గడువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.