ETV Bharat / state

మద్యం నియంత్రణ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలి : సీఎఫ్​డీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి - Citizens for Democracy Meeting - CITIZENS FOR DEMOCRACY MEETING

Citizens for Democracy Meeting in Vijayawada : ఎన్నికల వేళ యువతకు ఉచితంగా మద్యం పంపిణీ విషయంపై సిటిజన్స్​ ఫర్​ డెమోక్రసీ ఆధ్వర్యంలో రౌండ్​ టేబుల్​ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మద్యం నియంత్రణ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

citizen_for_democracy
citizen_for_democracy
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 3, 2024, 12:00 PM IST

మద్యం నియంత్రణ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలి : సిటిజన్స్​ ఫర్​ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి

Citizens for Democracy Meeting in Vijayawada : రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటర్ల, కార్యకర్తలు, యువతకు ఉచిత మద్యం పంపిణీకి స్వస్తి పలికి వారి భవిష్యత్తుని కాపాడాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో విజయవాడలో స్వేచ్ఛాయుత ఎన్నికలు, మద్యం ప్రభావం, నియంత్రణ 'మన ముందున్న సవాళ్లు' అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు.

ఎన్నికల్లో పోటీకి సామాన్యులు ఎక్కడ- ఒక్కో అభ్యర్థికి రూ.40 కోట్ల ఖర్చు: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ - Seminar On Election Reporting

Vallamreddy Lakshmana Reddy Comments : రాష్ట్రంలో జరిగే ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో ఉచితంగా మద్యం పంపిణీ వలన యువత చెడు అలవాట్లుకు బానిసలు అవుతున్నారని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆరోపించారు. అభ్యర్థులు ఖర్చు పెట్టే వ్యయంలో 25 శాతం మద్యం పంపిణీకే కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా అధికార ప్రభుత్వం మద్యం దుష్ఫలితాలను వివరించే ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వాలంటీర్ల ద్వారా అధికార పార్టీకి లబ్ధి- వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలి : నిమ్మగడ్డ రమేశ్​ - Nimmagadda Ramesh

Vallamreddy Comments YSRCP Government : సీఎం జగన్​ మోహన్​ రెడ్డి నుంచి స్థానిక ఎమ్మెల్యే స్థాయి వరకు ఎలాంటి సమీక్షలు మద్యంపై నిర్వహించలేదని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ధ్వజమెత్తారు. చిన్న వయసులోనే మద్యానికి అలవాటు అయితే వారు వ్యసనపరులుగా మారతారని తెలిపారు. ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దుల్లో వేలాది ఎకరాలలో గంజాయి పండిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకొలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అయినా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు మద్యం నియంత్రణను ప్రాధాన్య అంశంగా వారి మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు.

"మద్యం ఎంత ఎక్కువ అమ్మితే అంత ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మద్యం విక్రయం వల్ల వచ్చిన ఆదాయంతో సంక్షేమ పథకాలను అమలు చేసే దృక్పథంతో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మన ప్రక్కన ఉన్న బిహార్​ రాష్ట్రం 2016 నుంచి సంపూర్ణ మద్యంపాన నిషేధాన్ని అమలు చేస్తుంది. మన రాష్ట్రంలో మాత్రం మద్యం ఆదాయంతో సర్కారు నడుస్తుంది" _వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి

రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన జరిగేలా చర్యలు తీసుకోవాలి: నిమ్మగడ్డ రమేశ్

మహిళలు అందరూ కలిసి మద్య నియంత్రణపై రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి సూచించారు. కేంద్ర ప్రభుత్వం మద్యంపై జాతీయ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్​ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.