ETV Bharat / state

హైదరాబాద్‌లో మరో కొత్త గ్యాంగ్‌ హల్‌చల్ - వీరి స్టైలే చుడీదార్‌లతో దొంగతనం - Chudidar Gang in Hyderabad - CHUDIDAR GANG IN HYDERABAD

Chudidar Gang Loots in Hyderabad : హైదరాబాద్‌లో మరో కొత్త గ్యాంగ్‌ దోపిడీలకు సిద్ధమైంది. ఇప్పటివరకు చడ్డీ గ్యాంగ్‌, గొలుసు దొంగలు మాత్రమే చోరీలు చేస్తున్నారనుకుంటే, ఇప్పుడు చుడీదార్‌ గ్యాంగ్ అనే పేరుతో మరో గ్యాంగ్ దిగింది. దీంతో పోలీసులకు వారిని పట్టుకోవడం కష్టంగా మారింది. వారి వేషధారణ అచ్చం అమ్మాయిల చుడీదార్‌లో ఉంటుంది.

Chudidar Gang Loots in Hyderabad
Chudidar Gang Loots in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 23, 2024, 10:14 PM IST

హైదరాబాద్‌లో మరో కొత్త గ్యాంగ్‌ హల్‌చల్ - వీరి స్టైలే చుడీదార్‌లతో దొంగతనం (ETV Bharat)

Chudidar Gang in Hyderabad : చడ్డీ గ్యాంగ్‌, గొలుసు దొంగలు, తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలు చేసే నేరగాళ్లు. ఇప్పటివరకు ఇలాంటి తరహా ముఠాల ఆగడాలు చూశాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో 'చుడీదార్‌ ముఠా' చోరీ కలకలం రేపుతోంది. మహిళల వేషధారణలో కొందరు చుడీదార్‌ ధరించి దొంగతనాలకు తెగబడుతున్నారు. తొలిసారిగా ఈ తరహా ముఠా గురించి బయటపడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

జంటనగరాల్లో ఓ కొత్త ముఠా ఇళ్లలో చోరీలు చేస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా పక్కాపథకం ప్రకారం వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నగర శివార్లలో చెడ్డీగ్యాంగ్‌ సంచరిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అర్ధరాత్రి సమయాల్లో ఆ ముఠాలు సంచరిస్తూ చోరీలకు తెగబడుతోంది. ప్రస్తుతం చుడీధార్‌ ముఠా దొంగతనాలు బయటపడడంతో పోలీసులు ముఠాను పట్టుకునే పనిలో పడ్డారు. పలు ప్రాంతాల్లో గస్తీ పెంచారు.

New Chudidar Gang : హైదరాబాద్‌ జెక్‌ కాలనీలోని నాలుగోవీధిలో ఉన్న ఆకృతి ఆర్కేడ్‌ అపార్ట్‌మెంట్‌లో వెంకటేశ్వర్‌రావు నివసిస్తున్నారు. అదే అపార్ట్‌మెంట్‌పై అంతస్తులో ఆయన కుమార్తె, అల్లుడు ఉంటున్నారు. ఈనెల 16 వారంతా ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు వెళ్లారు. 18న ఉదయం పనిమనిషి ఇళ్లు శుభ్రం చేసేందుకు వచ్చి తాళంవేసి ఉండటాన్ని గమనించింది. పై అంతస్తులోని వెంకటేశ్వర్‌రావు కుమార్తె వద్దకు వెళ్లి తాళం చెవి తీసుకొని తలుపు తెరిచేందుకు వెళ్లగా తాళం పగలగొట్టి ఉండడం, ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడం గమనించింది. ఈ విషయం ఇంటి యజమాని కుమార్తెకు చెప్పగా పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించారు. మహిళల వేషధారణలో ముసుగు ధరించి దొంగలు చొరబడినట్లు గుర్తించారు. ఇంట్లోని నాలుగు తులాల బంగారం, లక్ష రూపాయల నగదు, ల్యాప్‌టాప్‌లను దొంగలించారు. ఆ సంఘటనతో అప్రమత్తమైన పోలీసులు చుడీదార్‌ ముఠా గురించి ఆరా తీస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా మహిళల వేషధారణతో ముఠా ఈ తరహా చోరీలు చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఊరు వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలి : కాలనీల్లో ఊళ్లకు వెళ్లే సమయంలో ముందుగా ఇతర కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని పోలీసులు నగరవాసులకు హెచ్చరిస్తున్నారు. అలాగే తమ ఇంటిని గమనిస్తుండమని చెప్పాలని పోలీసులు అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే ఎప్పుడు ఊరికి వెళ్తున్నారు, తిరిగి ఎప్పుడు వస్తున్నారనే విషయాల గురించి పోలీసులకు ముందస్తుగా తెలియజేయాలని వివరిస్తున్నారు.

చెడ్డీ గ్యాంగ్​ను మించిన దొంగ- ఒంటిపై బట్టల్లేకుండా చోరీలు

Cheddi Gang : హైదరాబాద్​లో మళ్లీచెడ్డీ గ్యాంగ్.. తస్మాత్ జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.