Chiranjeevi Donates 5 Crore Rupees to Janasena: జనసేన ఎన్నికల నిర్వహణ కోసం ప్రముఖ సినీ నటుడు చిరంజీవి 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. జనసేన పార్టీకి, పవన్ కల్యాణ్‌కు మెగాస్టార్ ఆశీస్సులు అందించారు. తన సోదరుడు పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీకి చిరంజీవి 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో ‘విశ్వంభర’ షూటింగ్ లొకేషన్‌కు పవన్ కల్యాణ్, నాగబాబు కలిసి వెళ్లారు. అక్కడే చిరంజీవి పవన్ కల్యాణ్‌ను హత్తుకుని ఆశీర్వదించారు. చిరంజీవి ఆశీర్వచనం అందుకున్న పవన్ కల్యాణ్ ఉద్వేగానికి లోనై అన్నయ్య పాదాలకు నమస్కరించారు. అనంతరం జనసేన ఎన్నికల నిర్వహణ కోసం 5 కోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో పవన్ కల్యాణ్‌కు అందించారు.
పిఠాపురంలో బిజీ బిజీగా సాగిన పవన్ కళ్యాణ్ పర్యటన
పార్టీ స్థాపించి పదేళ్లుగా అన్న చిరంజీవి ఆశీర్వాదాల కోసం పవన్ ఎదురు చూస్తున్నారు. తమ కుటుంబ ఇలవేలుపు అంజనీపుత్రుడి పాదాల చెంత చిరంజీవి పవన్ కల్యాణ్‌ని ఆశీర్వదించారు. తనను ఆహ్వానించి ఆశీర్వదించటంతో పాటు పార్టీకి ఆర్థిక సహకారం అందించటంతో పవన్ ఉద్వేగానికి లోనయ్యారు. నీ వెనక నేనున్నాను అనే భరోసా పవన్ కల్యాణ్‌కు దక్కింది. అనంతరం మెగా సోదరులు ముగ్గురూ కాసేపు సంభాషించుకున్నారు.
పిఠాపురంలో వర్మ త్యాగం గొప్పది - ఆయన్ను ఉన్నత స్థానంలో ఉండేలా చూస్తా: పవన్ కల్యాణ్
ఆదివారం అనకాపల్లిలో జరిగిన విజయభేరి సభలో లోకపావని నూకాలమ్మ దీవెనలను కోరుతున్న సమయంలో టీవీలో ఆ దృశ్యాన్ని చూసిన చిరంజీవి పవన్‌ను ఆహ్వానించారు. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ కూడా జనసేనకు ఆర్థికంగా అండగా నిలబడాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
సంతోషాన్ని కలిగించిన విషయం: అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు. కానీ అధికారం లేకపోయినా, తన సంపాదనను రైతు కూలీల కోసం పవన్ కల్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయమని చిరంజీవి తెలిపారు. తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కల్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకు విరాళాన్ని అందించినట్లు తెలిపారు. జనసేనకు విరాళం అందించడం సంతోషకరంగా ఉందని చిరంజివి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు.