ETV Bharat / state

చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ - ఈ నెల 27 వరకు అమరావతిలో పర్యటన - World Bank Funding to Amaravati - WORLD BANK FUNDING TO AMARAVATI

World Bank Funding to Amaravati: ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ నెల 27 వరకు అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బృందం పర్యటించనుంది. అమరావతి రాజధాని నగర నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధులు సమకూర్చనున్నాయి.

world_bank_funding_to_amaravati
world_bank_funding_to_amaravati (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 20, 2024, 4:46 PM IST

Updated : Aug 20, 2024, 7:53 PM IST

World Bank Representatives Meeting with CM Chandrababu Naidu : రాజధాని అమరావతి నిర్మాణాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన మరుక్షణం నుంచి అమరావితిలో అభిమృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో నిర్విరామంగా చర్చలు జరుపుతోంది. ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి నిర్మాణం కోసం నిధుల సమీకరణ ప్రక్రియ వేగవంతం చేసిన విషయం తెలిసిందే.

సీఎంతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ చర్చలు : అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణనికి నిధులు అందించే విషయమై చర్చించారు. అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్లు నిధులు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు అమరావతిలో పర్యటిచనున్నారు. ప్రాథమికంగా అమరావతిలో చేపట్టాల్సిన పనులు, దశల వారీగా నిధుల విడుదలపై సీఎంతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ చర్చలు జరిపారు.

రాజధానికి కేంద్రం స్పెషల్​ అసిస్టెన్స్​ - తొలి విడతగా రూ.15 వందల కోట్లు విడుదల - Capital Investment

ఈ నెల 27వ తేదీ వరకు వరల్డ్‌ బ్యాంకు బృందం పర్యటన : అమరావతి ప్రాజెక్టులో పనుల పురోగతి, క్షేత్ర స్థాయి పర్యటనలు, భూ సమీకరణ, మౌళిక సదుపాయాలు, పెట్టుబడుల అంశాలపై చర్చించారు. రాజధాని పరిధిలో ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టులు, విధాన నిర్ణయాలను ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే రాజధాని అమరావతిలో ప్రస్తుత పరిస్థితులు వచ్చే కాలంలో ప్రభుత్వ ప్రణాళికలను చంద్రబాబు వారికి వివరించారు. సీఆర్డీఏ పరిధిలో క్షేత్ర స్థాయిలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు పర్యటించారు. ఈ నెల 27వ తేదీ వరకు వరల్డ్‌ బ్యాంకు బృందం ఏపీలో పర్యటించనుంది. పురపాలకశాఖ మంత్రి నారాయణతో పాటు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధి, ఆర్థిక సాయానికి సంబంధించిన అంశాలపై సీఎంతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం రాజధాని అమరావతినగర అభివృద్ధికి 15,000 కోట్లు కేటాయించిన విషయం తెలసిందే. ఆధునిక రాజధానిగా అమరావతిని విజయవంతంగా ఏర్పాటు చేసేందుకు సహకార ప్రయత్నాన్ని సూచిస్తూ, కేంద్ర పరిపాలన నిధులను పొందేందుకు ప్రపంచ బ్యాంకుతో చురుకుగా పాల్గొంటోంది.

పర్యాటక హబ్‌గా అమరావతి - రూ. 500 కోట్లతో ప్రణాళికలు - Amaravati Tourism Development

'రాష్ట్రానికి కేటాయించిన నిధులు త్వరగా ఇవ్వండి'- ఆ విషయాలన్నీ మోదీ దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు - CM Chandrababu met Modi

Last Updated : Aug 20, 2024, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.