Cheetah In Mahanandi : నంద్యాల జిల్లా మహానంది క్షేత్ర సమీపాన చిరుత పులి సంచారం స్థానికుల్లో గుబులు రేపుతోంది. ఇవాళ ఉదయం ఆరు గంటల వరకు చిరుత పులి సంచరింనట్లు తెలిసింది. ఆలయ సమీపంలో గోశాల వద్ద చిరుత పులి నడుస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆలయ చెంతనే ఉన్న నల్లమల అడవిలో నుంచి చిరుత పులి వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. గత పది రోజులుగా చిరుత పులి ఇక్కడ తిరుగుతోందని వారు తెలిపారు. ఆలయం చుట్టూ విద్యుత్ సబ్ స్టేషన్, అన్నదాన సత్రం తదితర ప్రదేశాల్లో చిరుత తిరిగిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ రోజు (బుధవారం) సీసీ కెమెరాలో చిరుత పులి దృశ్యాల ఆధారంగా ఆలయ అధికారులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత పులి కాలి ముద్రలను సేకరించి విచారణ చేపట్టారు. కాగా మంగళవారం నంద్యాల గిద్దలూరు రహదారిలో పచ్చర్ల వద్ద చిరుత పులి దాడిలో ఓ మహిళ మృతి చెందింది. అక్కడ దాడి చేసిన చిరుత , మహానందిలో సంచరించే చిరుత ఒకేటేనా, వెర్వేరా అనే విషయం తెలియాల్సి ఉంది.
రైల్వే కూలీలపై చిరుతపులి దాడి- మహిళకు తీవ్ర గాయాలు - Cheeta attack women
Cheetah Attack On Women : నంద్యాల జిల్లా శిరివెళ్ళ మండలం పచ్చర్ల గ్రామ సమీపాన చిరుత పులి దాడిలో మొహరున్నిషా ( 45) అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. గ్రామ సమీపాన ఉన్న నల్లమల అడవిలోకి కట్టేలకోసం వెళ్లిన ఆమెపై చిరుత పులి దాడి చేసి చంపేసింది. దాడిలో మొహరున్ని తల మెండెం వేరుకావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. చిరుత పులి దాడి చేసే సమయంలో ఆమె కేకలు పెట్టిందని, అది గమనించిన స్థానికులు అక్కడి కి చేరుకునే లోపు మోహరున్ని మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు. గత పది రోజులుగా చిరుత పులి ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు స్థానికులు అటవిశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రైల్వే పనులు చేస్తున్న ఓ మహిళను దాడి చేసిందని తెలిపారు. ఈ ఘటన గడచి రెండు రోజులు కాకముందే మొహరున్నిషాను చిరుత చంపేయడం స్థానికంగా ఆందోళన కలిగించింది. మూడు రోజుల క్రితం మహిళ పై దాడి చేసిన చిరుత, మహానంది ఆలయ సమీపంలో వారం రోజులగా తిరుగాడుతున్న ఒకేటేనా అనే చర్చ సాగుతోంది. చిరుత పులి కోసం అటవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత పులి దొరికే లోపు వరస సంఘటనలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని అటవిశాఖ అధికారులు అంటున్నారు.
గత వారం రోజులుగా ప్రజలు బిక్కుబిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. పులి భయంతో బయటికెళ్లాలంటే జంకుతున్నారు. పులి పంజాకు చిక్కి ఒకరు ప్రాణాలతో బయటపడ్డప్పటికీ, ఓ యువతి అతి దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. ప్రజలు భయాందోళలో ఉన్నారు. అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి మరిన్ని ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తిరుమలలో చిరుత కలకలం - భక్తుల కారు సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు - Cheetah spotted at Tirumala