Cheeramenu Fish Auction at Yanam Fish Market: ఆకారంలో చూస్తే చాలా చిన్నది కాని ఆహార విషయంలో మాంసం ప్రియులకు బహుప్రీతికరమైనది. ఏడాది కాలంలో దీపావళి అమావాస్య సమయంలో సముద్ర తీరం నుంచి వీచే తూర్పు గాలుల ప్రభావంతో గుంపులు గుంపులుగా ఒక రకమైన నురుగు తెట్టు మాదిరిగా నీటిపై తేలియాడుతూ మత్స్యకారులకు చిక్కే ఈ చిన్న చేపను చీరమేను అంటారు. చేప జాతులలో ఇదే అతి చిన్న చేప. దీని జీవితకాలం కూడా గంటల వరకే.
దీపావళి సమయంలో సముద్ర తీరం నుంచి వీచే తూర్పుగాలుల ప్రభావంతో అలలపై నుగురుతెట్టు మాదిరిగా నీటిపై తేలియాడుతూ మత్స్యకారులకు చిక్కే ఈ చిన్న చేపనే చీరమేను అంటారు. గతంలో చీరల ద్వారా ఈ చేపలను పట్టేవారు అందుకే దీనికి ఆపేరు వచ్చింది. ప్రస్తుతం దీన్ని వేటాడడానికి వలలు అందుబాటులోకి వచ్చాయి. గత ఐదేళ్లలో ఎప్పుడూ ఇంతస్థాయిలో చీరమేను జాడ కనిపించలేదు. వాతావరణ పరిస్థితిల ప్రభావంతో ఈ రోజు బకెట్లకొద్ది చీరమేను మత్స్యకారుల వలలకు చిక్కడంతో యానాం మార్కెట్లో సందడి నెలకొంది.
పోలీసుల సెటిల్మెంట్లు - గాడి తప్పుతున్న పోలీసింగ్ - బాధితులకే అవమానాలు
ఆనందంలో మాంసాహార ప్రియులు: కాకినాడ జిల్లాలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం. గౌతమీ గోదావరి తీరాన నిర్వహించే వేలం పాట కేంద్రానికి అత్యధికంగా చీరమేను మత్స్యకారులు బకెట్లలో తీసుకొచ్చారు. గోదావరి నది పాయలు సముద్రంలో కలిసే భైరవపాలెం దరియాలతిప్ప ప్రాంతాల్లో ఈ చేప విరివిగా మత్స్యకారులు వలలకు చిక్కింది. గతంలో బకెట్ రూ.30 నుంచి రూ.రూ.40 వేల వరకు ధర పలికేది. ఈ రోజు మార్కెట్‌కి ఎక్కువగా ఈ చేపలు రావడంతో బకెట్ రూ.10 నుంచి రూ.12 వేలకే దొరుకుతుండడంతో మాంసాహార ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చిల్లరగా శేర్లు లెక్కన కొలిచి రెండు వేలకు విక్రయిస్తున్నారు. వచ్చే వారం నుంచి కార్తిక మాసం ప్రారంభం కానుంది. దానికి ముందుగానే మాంసాహార ప్రియులకు దీపావళి ఆఫర్ లభించినట్టుంది. ఇతర ప్రాంతాల్లో నివసించే బంధువులకు పంపించేందుకు కొందరు రెండు మూడు బకెట్లు చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
ముఖం చూసి నేర చరిత్ర చెప్పేస్తుంది - ప్రయోగాత్మకంగా సత్ఫలితాలు సాధించిన పోలీసులు