CHANDRABABU PRAJA GALAM MEETING: రాజధాని విషయంలో వైసీపీ మూడు ముక్కలాట ఆడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. అమరావతి పూర్తయితే ఇక్కడే అందరికీ ఉపాధి దొరికేదని, ప్రస్తుతం ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఓటు వేసిన వారినే కాటు వేసే రకం జగన్ అని ధ్వజమెత్తారు. నా ఎస్సీలు అంటూ వారి నెత్తిమీదే చెయ్యి పెడతారని, వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ నష్టపోయింది ఎస్సీలే అని విమర్శించారు.
దళితులకు చెందిన 25 కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వంలో రద్దు చేశారని, జగన్ దళితులను అన్ని రకాలుగా మోసం చేశారని ఆరోపించారు. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వినియోగం పెరిగిందన్న చంద్రబాబు, నాసిరకం మద్యం సరఫరా చేస్తున్నారని, ధరలు పెంచారని మండిపడ్డారు. నాసిరకం మద్యం తాగి అనేకమంది ప్రాణాలు పోతున్నాయని దుయ్యబట్టారు. రోడ్లపై గుంతలు పూడ్చలేని వ్యక్తి 3 రాజధానులెలా కడతారని నిలదీశారు. వైసీపీ పాలనలో ఆదాయం పెరిగిందా, ఖర్చులు తగ్గాయా అని ప్రజలను ప్రశ్నించారు. వైసీపీ పాలనలో నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయని ధ్వజమెత్తారు.
కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు చేయుత- అంబాజీపేటలో చంద్రబాబు - Chandrababu Naidu Election Campaign
వైసీపీ అరాచక పాలనపై ఇల్లు, వాకిలి, రోడ్డు, కుళాయి వద్ద ప్రతిచోటా చర్చించాలన్న చంద్రబాబు, దేశంలో మహిళలను గౌరవించిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని తెలిపారు. ఆడబిడ్డలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలని కోరుకున్నానన్న చంద్రబాబు, తన ముందుచూపు వల్ల ఆడపిల్లకే ఎదురుకట్నం ఇచ్చే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. పిల్లలే మన ఆస్తి అని, వారే మన సంపద అని అన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తమది అని వ్యాఖ్యానించారు. వచ్చిన సంపదను పేదలకు పంచడం తమకు తెలుసన్నారు.
అప్పులు తేవడం, సహజ వనరులను దోచేయడమే జగన్‌కు తెలుసు అని విమర్శించారు. యువతకు బంగారు భవిష్యత్తు చూపించే బాధ్యత తనది అని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి మంచి డ్రైవర్‌ను తానేనని, రివర్స్ గేర్‌లో వెళ్తూ ప్రజల జీవితాలను జగన్ నాశనం చేశారని దుయ్యబట్టారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనే దృఢసంకల్పంతో వచ్చానన్న చంద్రబాబు, ఈ ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వంలో ఎంత పూర్తి చేశారని ప్రశ్నించారు.
వైసీపీ తప్పుడు వీడియోలు - తెరపైకి ఫేక్ పరిశ్రమ : చంద్రబాబు - vigilance on YCP fake videos
ఎమ్మెల్యేలకు, మంత్రులకు సైతం జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వరని, తుపాను వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించలేదని మండిపడ్డారు. జగన్ వచ్చాక పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారని, కక్ష కట్టి మరీ రాజధాని అమరావతిని నాశనం చేశారన్నారు. హైదరాబాద్‌లా అమరావతిని అభివృద్ధి చేయాలని భావించానన్న చంద్రబాబు, వైసీపీలో కూడా కొందరు మంచివాళ్లు, కొందరు రౌడీలు ఉన్నారని తెలిపారు. రౌడీలు మనకు వద్దని, మంచివాళ్లు టీడీపీలోకి రావాలని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
గత ఐదేళ్లలో సీఎం జగన్ ఎవరినైనా కలిశారా అని ప్రశ్నించిన చంద్రబాబు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ ఎప్పుడూ బయటికి రాలేదని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా సీఎం కలవలేదని, తన ఇంటి ద్వారాలు మాత్రం పేదల కోసం ఎప్పుడూ తెరిచే ఉంచానని తెలిపారు. కరవు, తుపాన్లు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్న చంద్రబాబు, తుపాన్ల కంటే అసమర్థ సీఎం వల్ల ఎక్కువగా నష్టపోయారని అన్నారు.
రాష్ట్రంలో ధాన్యం కొనే దిక్కు లేదని, కొంటే డబ్బులు లేవని చంద్రబాబు విమర్శించారు. తుపాను వల్ల నష్టపోతే పరామర్శించేందుకూ సీఎం రాలేదని, ఇప్పుడు రైతుల పట్ల జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు ముద్దులు పెట్టాడు, ఇప్పుడు గుద్దులే గుద్దులు అని ధ్వజమెత్తారు. పట్టిసీమను ఏడాదిలోనే పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇచ్చానని చంద్రబాబు గుర్తు చేశారు. రాక్షస పాలన అంతానికి, నెత్తిన పెట్టుకున్న కుంపటిని దించేందుకు ప్రజలు నిర్ణయం తీసుకున్నారని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారని చంద్రబాబు అన్నారు.
వైసీపీది రౌడీయిజం - ఓటమి భయంతోనే హింసా రాజకీయాలు : చంద్రబాబు - Chandrababu Condemn Attack on tdp