Chandrababu, Pawan Kalyan Speech After Announcing First List : జగన్ వల్ల ఏపీ బ్రాండ్ దెబ్బ తిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ అరాచకాలను సామాన్యుల మొదలకుని తానూ, పవన్ కల్యాణ్(Pawan Kalyan) చాలా వరకు భరించామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాగద్వేషాలకు అతీతంగా రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని కాపాడాలనేదే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. ప్రజా వేదిక విధ్వంసంతో జగన్ పాలన ప్రారంభమైందని, అదే వరవడి చివరి వరకు కొనసాగిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జాబితా కోసం తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంత కసరత్తు చేశామని, 1.10 కోట్ల మంది నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. అన్ని కోణాల్లో విశ్లేషించి అభ్యర్థుల వడపోత చేశామని తెలిపారు.
టీడీపీ- జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఈ జాబితాలో యువత, మహిళలు, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని, ఇందులో 23 మంది తొలిసారి పోటీ చేస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 51 మంది గ్రాడ్యుయేట్స్ తమ తొలిజాబితాలో ఉన్నారని పేర్కొన్నారు. ఇరు పార్టీల మధ్య పోటీ విపరీతంగా ఉన్న సీట్లపై మరింత కసరత్తు కొనసాగుతుందని చెప్పారు. రాజమండ్రి రూరల్ సీటు విషయంలో తెలుగుదేశం - జనసేన ఆశావహులు ఇద్దరికీ న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కందుల దుర్గేష్ ఇద్దరిలో ఒకరు రాజమండ్రి రూరల్లో మరొకరు వేరే చోట పోటీ చేస్తారని ఆయన వెల్లడించారు.
2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు వీరే
Pawan Kalyan Comments : వైసీపీ తరుపున రౌడీలు, దోపిడీ దారులు, అభ్యర్థులుగా నిలబడ్డారని చంద్రబాబు (CNB) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రచందనం, గంజాయి స్మగ్లర్లును వైసీపీ పోటీకి దింపుతోందని చంద్రబాబు అన్నారు. జనసేన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక స్థానంలో ఉంటారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. సిద్దం అని వైసీపీ జగన్ అంటున్నారని, మేం యుద్దానికి సంసిద్ధంగా ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండటానికి మేం ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
"టీడీపీ అభ్యర్థులను నేను ఎంపిక చేస్తా. జనసేన అభ్యర్థులను పవన్ కల్యాణ్ ఎంపిక చేస్తారు. మొదటి విడత 94 సీట్లకు అభ్యర్థులను జాబితాను విడుదల చేస్తున్నాం. జనసేన, టీడీపీ మధ్య పోటీ విపరీతంగా ఉన్న సీట్లపై మరింత కసరత్తు జరిపాం. రాజమండ్రి రూరల్ సీటు విషయంలో తెలుగుదేశం - జనసేన ఆశావహులు ఇద్దరికీ న్యాయం జరుగుతుంది. గొరంట్ల బుచ్చయ్య, దుర్గేశ్‌లో ఎవరో ఒకరికి రాజమండ్రిలో మరొకరు వేరే చోట పోటీ చేస్తారు. వైసీపీ తరపున దోపిడీ దారులు అభ్యర్థులుగా నిలబడతున్నారు." - చంద్రబాబు, టీడీపీ అధినేత
చాలా మంది 60 లేదా 70 సీట్లలో పోటీ చేయాలని తమకు సూచనలు చేస్తున్నారని, గతంలో 10 సీట్లు గెలిచి ఉండుంటే అన్ని సీట్లను అడగటానికి అవకాశం ఉండేదని ఆయన చెప్పారు. ఇప్పుడు సీట్ల సంఖ్య ముఖ్యం కాదని, పరిమిత సంఖ్యలో పోటీ చేసి స్ట్రైక్ రేట్ గెలుపులో చూపించాలని ఉందని పవన్ చెప్పారు. బీజేపీకి సీట్లు ఇచ్చే క్రమంలో తాము సీట్లను తగ్గించు కుంటున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తామీ నిర్ణయం తీసుకున్నామని పవన్ చెప్పారు.
"జన సేన నుంచి 24 స్థానాలలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీని దృష్షిలో పెట్టుకొని సీట్లను తగ్గించుకుంటాం. వ్యక్తి ప్రయోజనాల కంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. కష్టపడి పనిచేసిన అభ్యర్థులకు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వారికి తగిన పదవి ఇస్తాం. వైసీపీ ఎన్ని పన్నాగాలు పన్నిన వాటిని ఎదుర్కొనడానికి సమర్థవంతంగా పనిచేస్తాం."- పవన్ కల్యాణ్, జనసేన అధినేత
బటన్ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతేంటి ? సైకో జగన్తో ప్రతి కుటుంబానికి 8లక్షల నష్టం: చంద్రబాబు
ఎన్నికల తంతు అంతా సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి చెప్పినట్టే : చంద్రబాబు