ETV Bharat / state

ఇసుక దోపిడీతోనే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది- రాజంపేట బాగుపడాలంటే వైసీపీ ఓడిపోవాలి: చంద్రబాబు,పవన్ - Chandrababu Satirical Comments - CHANDRABABU SATIRICAL COMMENTS

Chandrababu Naidu Satirical Comments వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మెుదలైందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అన్నారు. వైసీపీకి ఓటు వేస్తే ఏం జరుగుతుందో ప్రజలంతా చూశారన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించిన ఆయన జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

Chandrababu Naidu Satirical Comments
Chandrababu Naidu Satirical Comments
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 8:10 PM IST

Chandrababu Naidu Satirical Comments: ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయడు హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. రాజంపేట ప్రజల జీవితాలు బాగుపడాలంటే మిథున్‌రెడ్డి ఓడిపోవాలని పేర్కొన్నారు. వైసీపీకి ఓటు వేస్తే ఏం జరుగుతుందో ప్రజలంతా గమనించారని ఆయన ఎద్దేవా చేశారు.

రాజంపేట జిల్లా ఏర్పాటు చేయకుండా ఇక్కడి వారికి అన్యాయం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాజంపేట, రాయచోటి, మదనపల్లె దేనికీ అన్యాయం చేయమని, ఎక్కడైనా ప్రజాభిప్రాయం మేరకే పాలన జరగాలన్నారు. రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం కిరణ్‌కుమార్‌రెడ్డిదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టును బాగు చేస్తామని తెలిపారు. ప్రాజెక్టు బాధితులను ఆదుకుంటామని తెలిపారు. పేదలకు రెండు, మూడు సెంట్లు ఇంటి జాగా ఇచ్చి, ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. గాలేరు-నగరి కాలువ పూర్తి చేసి కృష్ణా జలాలు తీసుకొస్తామన్నారు. ఏప్రిల్‌ నుంచే పింఛను రూ.4వేలు ఇంటి వద్దే ఇస్తామన్నారు. 3 నెలల బకాయిలు జులైలో ఇస్తామని తెలిపారు. టీడీపీ మద్దతుదారుల పింఛన్లు తీసేశారని, టీడీపీ వచ్చాక మళ్లీ పింఛన్లు పునరుద్ధరిస్తామని తెలిపారు. ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగం వచ్చే వరకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైందని.. జగన్‌ ఇంటికి పోవడం ఖాయమని చంద్రబాబు జోష్యం చెప్పారు.

వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పిలుపునిచ్చారు. రాజంపేటలో నిర్వహించిన టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి సభలో పవన్‌ మాట్లాడారు. రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉందని, ఇది మారాలన్నారు. సారా వ్యాపారం చేసుకునే మిథున్‌రెడ్డి నన్ను ఓడిస్తారట అంటూ ఎద్దేవా చేశారు. యువత తలచుకుంటే మార్పు ఎందుకు రాదు? పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిని ఎదుర్కొనే గుండెబలం యువతకు లేదా? అని ప్రశ్నించారు. ఉపాధి అవకాశాలు లేక యువత రోడ్లపై తిరుగుతున్నారని, సంపదంతా పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు, కుమారుడు మిథున్‌రెడ్డి వద్దే ఉండిపోయిందని ఆరోపించారు. అన్నమయ్య డ్యామ్‌ ప్రమాదంలో ఉందని ముందే హెచ్చరించారని, డ్యామ్‌లో ఇసుక తోడేయడం వల్ల 39 మంది చనిపోయారని ఆరోపించారు. డ్యామ్‌లు కొట్టుకుపోతున్నా పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి పట్టించుకోరు, ప్రశాంతంగా కూర్చుని మద్యం వ్యాపారం చేసుకుంటున్నారని పవన్ దుయ్యబట్టారు. రాజంపేట ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని, ఇక్కడి ముఠా నేతలు రూ.10వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టారని ఆరోపించారు. పెద్దిరెడ్డి ఈ ప్రాంతానికి రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని తీసుకొచ్చారని పవన్‌ విమర్శించారు.

చంద్రబాబుతో బీజేపీ జాతీయ నేతల భేటీ - ఉమ్మడి ఎన్నికల వ్యూహంపై చర్చ - BJP Leaders Meet Chandrababu

జగన్‌ సర్కార్‌ మాఫియా ప్రభుత్వంగా మారిపోయిందని రాజంపేట కూటమి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి నిర్వాకం వల్లే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని విమర్శించారు. నేటికి బాధితులను వైసీపీ ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా మిథున్‌రెడ్డిని ఓడిస్తేనే రాజాంపేట బాగుపడుతుందని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు.

ఎన్నికల బరిలో ముఖ్యమంత్రుల వారసులు - వాళ్లు ఎవరో తెలుసా? - AP ELECTIONS 2024

ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.