ETV Bharat / state

సీఎంగానే శాసనసభకు - రెండున్నరేళ్ల తర్వాత అడుగుపెడుతున్న చంద్రబాబు - CM chandrababu to Assembly - CM CHANDRABABU TO ASSEMBLY

Chandrababu Coming to Assembly: ముఖ్యమంత్రి హోదాలోనే చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు. రెండున్నరేళ్ల తర్వాత చంద్రబాబు శపథం ఫలించింది. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి శాసనసభ తొలి సమావేశానికి వెళ్లాలని తెలుగుదేశం శాసనసభాపక్షం నిర్ణయించింది. రెండున్నరేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబు ఇవాళ తొలిసారిగా అసెంబ్లీకి రానున్నారు.

Chandrababu Coming to Assembly
Chandrababu Coming to Assembly (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 7:17 AM IST

Chandrababu Coming to Assembly: ముఖ్యమంత్రిగా మళ్లీ గౌరవసభలోనే అడుగుపెడతానని 2021 నవంబర్ 19న శపథం చేసిన చంద్రబాబు, రెండున్నరేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత నేడు తొలిసారిగా అసెంబ్లీకి రానున్నారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ నేడు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించి శాసనసభ తొలి సమావేశాలకు వెళ్లాలని తెలుగుదేశం శాసనసభాపక్షం నిర్ణయించింది. ఉదయం అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించనున్నారు. ఉదయం 9 గంటలకల్లా పసుపు చొక్కాలతో వెంకటపాలెం రావాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు సూచనలు జారీ చేసింది.

ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన గోరంట్ల- అసెంబ్లీలో ఫస్ట్ ప్రమాణం చేసేదెవరో తెలుసా? - andhra pradesh assembly session

నాటి శపథం నిలబెట్టుకుంటూ: "ముఖ్యమంత్రిని అయ్యాకే మళ్లీ సభకు వస్తాను, నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇదొక కౌరవ సభ. ఇలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకో నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ అవమానం మీరందరూ అర్థం చేసుకుని నిండు మనస్సుతో ఆశీర్వదించమని కోరుతున్నా" ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీలో జరిగిన అవమానంపై అప్పట్లో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలివి.

2021 నవంబర్​ 19వ తేదీన రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం సాగింది. తాను మాట్లాడుతుండగా స్పీకర్​ మైక్​ కట్​ చేశారని చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలు శాసనసభను బహిష్కరించి బయటకు వచ్చారు. వెంటనే చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో సమావేశమై బోరున విలపించారు. అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు తన భార్యను అవమానించేలా మాట్లాడారని గద్గద స్వరంతో తెలిపారు.

అమరావతి వైభవం-విలసిల్లాలి నలుదిశలా! అదే చంద్రన్న ఆన - cm chandrababu visiting amaravati

తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ, ఎవరినీ అవమానించేలా మాట్లాడలేదని ఆనాడు చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగలేదని, అధికారం పోయినప్పుడు కుంగిపోలేదని అన్నారు. ఎవ్వరి పట్లా అమర్యాదగా ప్రవర్తించలేదని, కానీ తన భార్య గురించి అసెంబ్లీలో వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడిన భాష నీచంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ నాడు శపథం చేశారు.

ఎనిమిదిసార్లు ఎన్నికైన తన అనుభవంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నేడు చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెడుతున్న సందర్భంగా, సీఎంగా అయ్యాకే మళ్లీ సభలో అడుగుపెడతానంటూ నాడు చంద్రబాబు చేసిన శపథాన్ని టీడీపీ శ్రేణులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.

ఏపీ అంటే అమరావతి, పోలవరం- త్వరలో వీటిపై శ్వేతపత్రాలు: సీఎం చంద్రబాబు - CM Chandrababu Media Conference

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.