Chandrababu met TDP Ticket Aspirants: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబును పలువురు టీడీపీ నేతలు కలుస్తున్నారు. ఇప్పటికే మెుదటి విడతలో టీడీపీ-జనసేన అభ్యర్థుల పేర్లు ప్రకటించిన నేపథ్యంలో, రెండో విడతలో తమ పేర్లు ప్రకటించాలంటూ చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. టికెట్ ఆశించే నేతలు, టికెట్ రాదని తెలిసిన నేతలతో చంద్రబాబు విడివిడిగా భేటీ అవుతున్నారు. పోటీ చేసే అంశంతో పాటుగా, స్థానిక పరిస్థితులను చంద్రబాబు నేతలకు వివరిస్తున్నారు.
మెుదలైన బుజ్జగింపుల పర్వం: తొలి జాబితాలో సీటు కోల్పోయిన అభ్యర్థులు, పలువురు ఆశావహులు, సీట్లు ప్రకటించని స్థానాల ఆశావహులు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన నివాసంలో కలుస్తున్నారు. సీట్లు కోల్పోయిన నేతలను బుజ్జగించి రాజకీయ భవిష్యత్‌కు చంద్రబాబు హామీ ఇస్తున్నారు. కడప పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి నారా చంద్రబాబు నివాసానికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో కడప లోక్ సభ టికెట్ శ్రీనువాసులు రెడ్డి ఆశిస్తున్నారు. తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని జయ చంద్రా రెడ్డికి కేటాయించారు. సోమవారం చంద్రబాబు నివాసానికి వచ్చి శంకర్ యాదవ్ కే సీటు ఇవ్వాలని నేతలు కోరారు. గుంటూరు- 2 ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర చంద్రబాబుని కలిశారు. గుంటూరు- 2 సీటును అయన ఆశిస్తున్నారు. జేసీ పవన్ రెడ్డి చంద్రబాబును కలిసిన వారిలో వున్నారు. పవన్ రెడ్డి అనంతపురం లోక్ సభ స్థానాన్ని ఆశిస్తున్నారు. అనంత లోక్‌సభకు పోటీ చేయాల్సిందిగా ఇప్పటికే బీకే పార్దసారధికి చంద్రబాబు సూచించిన సంగతి తెలిసిందే.
మీడియా ప్రతినిధులు, సంస్థలపై పగబట్టిన జగన్ - ఖండించిన నేతలు
టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్న లావు: నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో లావు టీడీపీలో చేరనున్నారు. పల్నాడు జిల్లా అభివృద్ధి కోసం మళ్లీ పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా మళ్లీ ప్రజల ముందుకొస్తున్నానని తెలిపారు. ఇదే విషయమై భేటీలో ఎంపీ చర్చించినట్లు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.
విజయవాడలో 'విధ్వంసం' పుస్తకావిష్కరణ - హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ - ప్రత్యక్షప్రసారం
బీజేపీతో ఉన్నా మా మద్ధతు టీడీపీకే: మైనార్టీలకు తెలుగుదేశం ఎప్పుడూ సముచిత స్థానం కల్పిస్తుందని మాజీ ఎమ్మెల్యే చాంద్ భాషా తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసానికి చాంద్ భాషా వచ్చారు. కదిరి అసెంబ్లీ లేదా హిందూపురం లోక్ సభ టికెట్‌ను ఆయన ఆశిస్తున్నారు. కదిరి అసెంబ్లీ స్థానం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరానని చాంద్‌భాషా తెలిపారు. హిందూపురం లోక్ సభ స్థానం నుంచి గతంలో మైనార్టీలు గెలిచిన చరిత్ర ఉందని అన్నారు. మైనార్టీలతో ఓట్లేయించుకున్న జగన్, మైనార్టీలకు తీరని అన్యాయం చేశారని చాంద్‌భాషా ఆరోపించారు. వైఎస్సార్సీపీ బెదిరింపులతో ఏకంగా ఓ మైనార్టీ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో మైనార్టీలకు సంక్షేమం జరిగిందని, మైనార్టీలు అభివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు. బీజేపీతో పొత్తు ఉన్నా, మైనార్టీలు టీడీపీతోనే ఉంటారని చాంద్‌భాషా స్పష్టం చేశారు.
దమ్ముంటే అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా జగన్ : చంద్రబాబు