Chandrababu Interact with Women: మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన వ్యక్తి దివంగత నేత ఎన్టీఆర్ అని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఆడ బిడ్డలు బాగా చదువుకోవాలని మహిళా యూనివర్సిటీలు స్థాపించారు. మహిళలకు రాజకీయంగా అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. టీడీపీ. డ్వాక్రా సంఘాలకు అప్పలను మాఫీ చేశా. ఈనాడు ఆడపిల్లలకు ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే., ఆ అవకాశం నేనే కల్పించానని చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ అధినేత జగన్ మాత్రం, ఆయన చెల్లెమ్మకు ఆస్తి కాకుండా అప్పులు ఇచ్చాడని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాక ముందు ముద్దులు పెట్టాడు, వచ్చాక గుద్దుడే గుద్దుడు అని ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా శక్తి కోసం టీడీపీ అనేక పథకాలు చేపట్టబోతుందని చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్ఠం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ పరిధి బొండపల్లిలో మహిళల ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. మోసగాళ్లు మరలా వస్తారు. రక రకాల మాటలు చెప్తారని మహిళను హెచ్చరించారు. గతాన్ని గుర్తు చేసుకోండి. ఆడవాళ్లకు పుట్టినిల్లు టీడీపీ. మహిళలకు రాజకీయంగా అవకాశం కల్పించి, వారికి పదవులు కల్పించింది టీడీపీ అని చంద్రబాబు తెలిపారు. ఆడ బిడ్డలు చదువుకునేందుకు ప్రతి కిలోమీటర్‌కు ఒక మండల పరిషత్ పాఠశాల, ప్రతి మూడు కిలోమీటర్ ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రతి పది కిలోమీటర్ పరిధిలో ఒక జూనియర్ కళాశాల తీసుకొచ్చామన్నారు.
ఎన్నికల ప్రచారంలో పచ్చి అబద్ధాలు- ఓట్ల కోసం ఇంతగా దిగజారాలా జగన్? - CM Jagan Election Campaign
వైసీపీ ప్రభుత్వం హయాంలో నాటి పరిస్థితికి పూర్తి భిన్నంగా మారిందని చంద్రబాబు పేర్కొన్నారు. విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయి. చివరికి క్వాటర్ బాటిల్ రేటూ పెరిగింది. చాలా మంది పిల్లలు గంజాయికి, కల్తీ మద్యానికి, డ్రగ్స్ కి అలవాటు పడ్డారు. ఆ మత్తులో ఉండి, తల్లికి, చెల్లికి తేడా తెలియకుండా పోయింది. ఇంటికి అండగా ఉండాల్సిన మహిళ, ఈ రోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మహిళలూ మీ ఖర్చులు లెక్క కట్టండి. ప్రభుత్వం మీకిచ్చేది ఎంత, మీ దగ్గర నొక్కింది ఎంత అనేది లెక్క కట్టండి. మీ పై అప్పులు చేసి పాలన చేస్తున్నాడు, జగన్. ఈ పరిస్థితుల్లో సంపద సృష్టించి పాలన చేసేవాడు కావాలా, అప్పులు చేసి పాలన చేసే వ్యక్తి కావాలా అని ఆలోచన చేయండని చంద్రబాబు నాయుడు మహిళలకు పిలుపునిచ్చారు.
చంద్రబాబు ప్రసంగం అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలపై గళం విప్పారు. వైసీపీ అరచకాలు, భూ దందా, లోపాభూయిష్ఠంగా రూపొందించిన భూ సర్వే పర్యవసనాలు, పేదల పథకాల్లో కోతపై గళమెత్తారు. టీడీపీ తిరిగి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూనే, తమ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా పలువురు మహిళలు చంద్రబాబుని విజ్ఞప్తి చేశారు.