ETV Bharat / state

ఏపీలో నగర వనాల అభివృద్ధికి నిధులు - తొలి విడతగా రూ.15.4 కోట్లు - Urban Forests in AP - URBAN FORESTS IN AP

11 City Forests in AP : ఆంధ్రప్రదేశ్​లో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాల అభివృద్ధికి కేంద్ర నిధులను మంజూరు చేసింది. 11 చోట్ల నగర వనాల కోసం తొలి విడతగా రూ.15.4 కోట్లు విడుదల చేసిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ నిధులతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు.

Urban Forests in AP
Urban Forests in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2024, 9:49 AM IST

Updated : Aug 25, 2024, 12:18 PM IST

Urban Forests in AP : ప్రకృతి అందాలు తిలకించేందుకు, అడవులను ప్రజలకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నగర వనాల అభివృద్ధికి 2023లో శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. 11 మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో నూతనంగా వీటి అభివృద్ధి కోసం తొలి విడతగా రూ.15.4 కోట్లను విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

11 City Forests in AP : ఈ నిధులతో కర్నూలులోని గార్గేయపురం, కడప, నెల్లిమర్లలోని వెలగాడ, చిత్తూరు డెయిరీ, కలిగిరికొండ, కైలాసగిరి, తాడేపల్లిగూడెంలోని ప్రకాశరావుపాలెం, పెనుకొండలోని శ్రీకృష్ణదేవరాయ కోట ఎకోపార్క్, కదిరిలోని బత్రేపల్లి వాటర్‌ఫాల్స్‌ ఎకోపార్క్, పలాసలోని కాశీబుగ్గ, విశాఖలోని ఈస్టర్న్‌ ఘాట్‌ బయోడైవర్సిటీ సెంటర్లలో నగర వనాలను అభివృద్ధి చేస్తామని పవన్ కల్యాణ్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన అటవీ శాఖ అధికారులతో చర్చించారు.

నగర వనాలకు సంబంధించిన పనులపై పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ప్రస్తుతం ఏపీలో 50 నగర వనాల అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయనీ అధికారులు ఆయనకు తెలిపారు. రాబోయే 100 రోజుల్లో 30 నగర వనాల పనులు పూర్తి కావస్తాయని వారు వివరించారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే అవకాశాలు వస్తున్నాయని పవన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్​లో పచ్చదనం సుమారు 50 శాతం ఉండాలని చెప్పారు. ఇందులో భాగంగా నగర వనాల అభివృద్ధిపై దృష్టిసారించాలని అధికారులకు సూచించారు.

వేడుకలా వనమహోత్సవం : ఈ నెల 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న వనమహోత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పవన్‌ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఇందులో యువత భాగస్వామ్యాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేడుకలా చేయాలని చెప్పారు. ప్రభుత్వ శాఖలతో పాటు అన్ని విద్యాసంస్థలు, పరిశ్రమలు, ఇతర సంస్థల వారు ఇందులో పాలుపంచుకునేలా చేయాలని అధికారులకు పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం చేశారు.

అడవుల రక్షణ కోసం జీవితం అంకితం- ఎన్నో అవార్డులు అందుకున్న ఈయన​ గురించి తెలుసా? - Kerala Man Planted Mangrove Plants

మడ అడవులు విధ్వంసం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు : పవన్ కల్యాణ్ - Pawan on Mada Forests Protection

Last Updated : Aug 25, 2024, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.