ETV Bharat / state

వచ్చే ఏడాది 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు - ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ ప్రకటన - MLC Voter List Revision in TG - MLC VOTER LIST REVISION IN TG

EC Announced Schedule for MLC Voter List Revision : రాష్ట్రంలో వచ్చే ఏడాది 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2025 మార్చి 29తో ప్రస్తుత ఎమ్మెల్సీలు జీవన్‌ రెడ్డి, రఘోత్తం రెడ్డి, నర్సిరెడ్డిల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఓటరు జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.

Central Election Commission
MLC Voter List Revision (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 3:32 PM IST

Updated : Aug 5, 2024, 4:18 PM IST

MLC Voter List Revision in Telangana : వచ్చే ఏడాది జరగనున్న 3 శాసన మండలి స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. సెప్టెంబరు 9 నుంచి ఓటర్ల నమోదు చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 29న పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీలు రఘోత్తం రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీకాలం ముగియనుంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల, టీచర్ నియోజకవర్గాలతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఓటర్ల జాబితా తయారీకి సెప్టెంబరు 30న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఈవో తెలిపారు.

నవంబరు 6 వరకు ఓటర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించి, అదే నెల 23న ముసాయిదా ప్రకటిస్తారు. డిసెంబరు 25 వరకు అభ్యంతరాలను స్వీకరించి, 30వ తేదీన తుది జాబితా ప్రకటించనున్నట్లు సీఈవో తెలిపారు. గతంలోని ఓటరు జాబితాలో పేరు ఉన్నప్పటికీ, మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.

Last Updated : Aug 5, 2024, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.