Village and Ward Secretariat Staff for Election Duties: గ్రామసచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు ఎన్నికల విధుల కేటాయింపుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందికి ఇంకు రాసే లాంటి చిన్న చిన్న విధులు మాత్రమే అప్పగించాలని పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసింది. ఎన్నికల విధుల్లో అర్హులైన సచివాలయ సిబ్బంది నియామకానికి అభ్యంతరం లేదని పేర్కొంటూ లేఖలో పేర్కొన్నారు. పోలింగ్ ఏజెంట్లు గానూ వాలంటీర్లను అనుమతించ వద్దని ఈసీఐ పేర్కొంది. ఈసీఐ ఉత్తర్వులను అనుసచించి అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఈఓ కార్యాలయం సూచనలు జారీ చేసింది.
నామమాత్రపు పనులకు మాత్రమే: గ్రామవార్డు సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకునే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఓటర్లకు ఇంకు చుక్కలు పెట్టడం వంటి చిన్న చిన్న విధులు మాత్రమే అప్పగించాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లోకి తీసుకునేందుకు అభ్యంతరం లేదని చెప్పిన ఈసీఐ గ్రామవార్డు సచివాలయ సిబ్బందికి నామమాత్రపు పనులు మాత్రమే అప్పగించాలని పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసింది. సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఎన్నికల విధులేవీ వారికి అప్పగించొద్దని స్పష్టం చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సూచనలు జారీ చేసింది.
రైట్ టు ఓట్ - ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉత్సాహంగా ఉన్న యువత
ఎన్నికల అధికారులకు సూచనలు: ఈసీఐ ఆదేశాల మేరకు గ్రామవార్డు సచివాలయ సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించేందుకు అభ్యంతరం లేదని పేర్కొంటూ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సూచనలు జారీ చేశారు. అర్హులైన గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను పోలింగ్ పార్టీలో ఒకరిగా సార్వత్రిక ఎన్నికల్లో విధులు అప్పగించొచ్చని పేర్కొంటూ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈసీఐ సూచనల మేరకు ఎన్నికల ప్రధాన విధులు వారికి అప్పగించొద్దని స్పష్టం చేశారు. ఓటర్లకు ఇంకు రాసే పనుల లాంటి ఇతర విధులు మాత్రమే అప్పగించాల్సిందిగా సూచనలు జారీ చేశారు. ప్రతీ పోలింగ్ పార్టీలోనూ అర్హులైన ఒక రెగ్యులర్ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగిని నియమించుకోవచ్చని ఈసీఐ పేర్కొంది.
ఆ మాజీ మంత్రికి మూడు చోట్లు ఓటు హక్కు! తాజాగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాతో వెలుగులోకి
ఇతర విధులు అప్పగించేలా: మరోవైపు బీఎల్ఓలుగా వ్యవహరించిన గ్రామవార్డు సచివాలయ సిబ్బందిని పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని తేల్చి చెప్పింది. బీఎల్ఓలుగా విధులు నిర్వహించిన సచివాలయ సిబ్బందికి పోలింగ్ రోజున ఎన్నికల విధులు కాకుండా ఇతర విధులు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది. గ్రామవార్డు వాలంటీర్లకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎన్నికల సంబంధిత విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది. అభ్యర్ధులకు పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లను అనుమతించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది.