ETV Bharat / state

ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్​ - మరో డీఎస్పీ ఇంట్లోనూ సోదాలు - CCS ACP Umamaheswara Rao Remand

author img

By ETV Bharat Telangana Team

Published : May 22, 2024, 7:39 PM IST

CCS ACP Umamaheswara Rao Arrest : సీసీఎస్​ ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్​కు పంపించారు. ఈ రిమాండ్​ 14 రోజులు విధించారు. ఈ మేరకు ఆయనను చంచల్​గూడకు తరలించారు. రూ.3 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. ఉమామహేశ్వరరావు నివాసంలో రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన రిమాండ్​ రిపోర్టును పోలీసులు విడుదల చేశారు.

ACP Umamaheswara Rao Remand for 14 Days
ACP Umamaheswara Rao Remand for 14 Days (ETV Bharat)

CCS ACP Umamaheswara Rao Remand for 14 Days : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్​ సీసీఎస్​ ఏసీపీ టీఎస్​ ఉమామహేశ్వరరావుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్​ విధించింది. ఈ మేరకు ఆయనను పోలీసులు చంచల్​గూడకు తరలించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రూ.3 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. ఉమామహేశ్వరరావు నివాసంలో రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్​ ఉపకరణాలు, డైరీల్లో సందీప్​ అనే పేరును గుర్తించారు. ఇద్దరు కలిసి ఏమైనా ఆర్థిక లావాదేవీలు సాగించారా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.

హైదరాబాద్​ శివార్లతో సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 17 ప్రాంతాల్లో స్థిరాస్తులను అధికారులు గుర్తించారు. ఉమామహేశ్వరరావు అరెస్టు చేశారు. మధ్యాహ్నం తర్వాత ఆయనను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్​ విధించారు. ఈ మేరకు ఉమామహేశ్వరరావును చంచల్​గూడ జైలుకు తరలించారు.

రిమాండ్​ రిపోర్టులో సంచలన విషయాలు : అశోక్​ నగర్​లో 205, 504 ఫ్లాట్స్​లో సోదాలు నిర్వహించామని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. బర్కత్​పురాలో డీఎస్పీ సందీప్​ రెడ్డి నివాసంలో కూడా సోదాలు జరిపారు. మరోవైపు కాప్రాలోని స్నేహితుడు నరేంద్ర బాబు నివాసంలో దాడులు చేశారు. సికింద్రాబాద్​లో​ నీలిమా నివాసం, అనకాపల్లిలో బంధువు మహాలక్ష్మి, విశాఖపట్టణంలోని బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు చేశారు. ఈ సోదాల్లో నగదు రూ.38 లక్షలు, బంగారం 60 తులాలు స్వాధీనం చేసుకున్నారు.

షామీర్​ పేట్​లో రూ.80 లక్షలు విలువైన ఎకరం భూమి, 333 గజాల విల్లాను గుర్తించారు. జవహర్​ నగర్​లో మూడు గుంటలు, ఘట్​కేసర్​లో నాలుగు ప్లాట్లు, శామీర్​ పేట్​లో 14 గుంటల బినామీ భూమి, అశోక్​ నగర్​లో ఉన్న అపార్టుమెంట్​లో మూడు ఫ్లాట్లను, కూకట్​పల్లిలో 200 గజాల ఫ్లాట్​ను గుర్తించారు. ఏపీలోని విశాఖపట్టణంలో 25 సెంట్ల భూమి, చోడవరంలో 5.92 ఎకరాలు, 240 గజాల ప్లాట్, దొండపూడిలో 2.20 ఎకరాల బినామా ఆస్తులపై దర్యాప్తు కొనసాగుతోంది. ఉమామహేశ్వరరావుతో పాటు మరో డీఎస్పీ ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆర్​ఎస్​ కన్ట్రక్షన్లో విలా కొనుగోలు కోసం ఉమామహేశ్వరరావు రూ.50 లక్షల పెట్టుబడి పెట్టారు. నిందితుడు ఉమామహేశ్వరరావుపై దర్యాప్తు కొనసాగుతుంది.

సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ - ఏసీబీ తనిఖీల్లో భారీగా అక్రమాస్తులు - ACB Raids On ACP Uma Maheswar House

హైదరాబాద్ సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.