Plasma Leakage Cases in Dengue Victims in Hyderabad : డెంగీ సోకిన వ్యక్తికి ప్లేట్‌లెట్లు తగ్గుతాయని అది ప్రమాదకరమని తెలిసిన విషయమే. అయితే దానికంటే ప్లాస్మా లీకేజీ మరింత ఎక్కువ ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రుల్లో ఎక్కువ మంది చికిత్స పొందుతున్నారు. డెంగీ వైరస్ సోకినప్పుడు రక్త నాళాల్లోని ఎండోథిలియం పొరలో వాపు వచ్చి వాటి మధ్యలో ఖాళీలు ఏర్పడతాయి. తద్వారా రక్తంలోని ప్లాస్మా లీకేజీ అవుతుంది. కొందరిలో డెంగీ సంక్లిష్టం కావడానికి ప్లాస్మా లీకేజీ ప్రధాన కారణం.
డెంగీ ఫీవర్‌తో విలవిల - ఈ జాగ్రత్తలు పాటించకపోతే ముప్పే! - Dengue Fever Cases in Telangana
ప్లాస్మా లీకేజీని ఈ లక్షణాలతో గుర్తించొచ్చు.
- కాళ్లు, కంటిచూట్టూ వాపు
- రక్తంలో హెమటోక్రిట్ స్థాయులు పెరగడం
- పల్స్, బీపీ పడిపోవడం
- కాళ్లు, చేతులు చల్లబడటం
- వాంతులు, కడుపులో తీవ్రమైన నొప్పి
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆలస్యం చేయడం వల్ల హెమరేజిక్ షాక్ సిండ్రోమ్‌కు దారి తీసి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
"డెంగీ వ్యాధి నిర్ధారణ అయితే ఏం భయపడాల్సిన అవసరం లేదు. నిర్లక్ష్యం కూడా పనికిరాదు. డెంగీకి ఎలాంటి మెడిసిన్ లేదు. జ్వరం వస్తే పారాసిటమాల్‌తో పాటు ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పది శాతం మందిలో కొంత ప్లాస్మా లీకేజీ ముప్పు ఉంటుంది. ప్లాస్మా లీకేజీ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి." - డాక్టర్ రాజారావు, సీనియర్ వైద్యులు
నిలోఫర్‌లో చికిత్స పొందుతున్న చిన్నారులు |
40-50 |
ప్లాస్మా లీకేజీ అవకాశం |
10శాతం మందిలో |
డెంగీ లక్షణాలు కనిపించేది (దోమ కుట్టిన తర్వాత) |
4-7రోజుల్లో |
ప్లాస్మా లీకేజీ జరిగేది |
ఆ తర్వాత 4-7 రోజుల్లో |
జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
డెంగీ, గన్యా జ్వరాలు దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయని, అందుకే దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యలు హెచ్చరిస్తున్నారు. కాచి వడపోసిన నీరు తాగాలని, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తినవద్దని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, తుమ్ములు, ఆయాసం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
How to Prevent Dengue Fever Telugu : మీ ఇంట్లో 'డెంగీ' దోమలున్నాయా.. ఈ చిట్కాలతో అడ్డుకట్ట వేద్దాం
Viral Infection VS Dengue : డెంగ్యూ Vs వైరల్ ఇన్ఫెక్షన్.. లక్షణాలు ఒకేలా ఉంటాయా.. తేడా ఏంటీ..?