ETV Bharat / state

తెలంగాణలో వెలుగులోకి మరో స్కామ్ - మాజీ సీఎస్ సోమేశ్ కుమార్​పై కేసు నమోదు - SOMESH KUMAR GST SCAM IN TELANGANA

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 29, 2024, 7:03 AM IST

Updated : Jul 29, 2024, 7:15 AM IST

Case Filed Against Somesh Kumar in GST Scam : జీఎస్టీ కుంభకోణంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామప్రసాద్, ఐఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ నిందితులుగా ఉన్న ఈ కేసులో ఐదో నిందితుడిగా సోమేశ్‌ కుమార్‌ను చేర్చారు. వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకుని మరీ వీరు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.

Somesh Kumar GST Scam Case
Somesh Kumar GST Scam Case (ETV Bharat)

EX CS Somesh Kumar GST Fraud : రాష్ట్రంలో భారీ జీఎస్టీ కుంభకోణం వెలుగు చూసింది. వాణిజ్యపన్నులశాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక్క తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారానే వాణిజ్య పన్నుల శాఖకు రూ.1,000కోట్లకుపైగా నష్టం వాటిల్లగా మరో 11 ప్రైవేటు సంస్థలు సుమారు రూ. 400కోట్లు ఎగవేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్​ఐఆర్​ ప్రకారం మానవవనరులను సరఫరా చేసే బిగ్‌లీప్‌ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పన్ను చెల్లించకుండానే రూ. 25.51కోట్ల ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ తీసుకుని మోసానికి పాల్పడినట్లు తేలిన నేపథ్యంలో వాణిజ్యపన్నుల శాఖ అంతర్గతంగా విచారణ జరిపింది.

వాణిజ్య పన్నుల శాఖకు సాంకేతికతను అందించే సర్వీస్ ప్రొవైడర్‌గా ఐఐటీ హైదరాబాద్ వ్యవహరించింది. రాష్ట్రంలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్న్ అక్రమాలను గుర్తించడంతోపాటు డేటాను విశ్లేషించడం, సర్వీస్ ప్రొవైడర్ చేయాల్సిన పని. పన్ను చెల్లింపుదారుల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సర్వీస్ ప్రొవైడర్ రూపొందించిన 'స్క్రూటినీ మాడ్యూల్' గుర్తించాల్సి ఉంటుంది. కానీ బిగ్‌లీప్‌ టెక్నాలజీస్ అక్రమాలకు పాల్పడినా ఈ మాడ్యూల్ గుర్తించలేదు. వాణిజ్య పన్నుల శాఖ అంతర్గత విచారణలో తీగ లాగితే డొంక కదిలింది. బిగ్‌లీప్‌ అక్రమాల నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ నియమించిన అధికారి గతేడాది డిసెంబరు 26న ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణంలో విచారణ జరిపారు.

Telangana GST Scam 2024 : అప్పటి రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితోపాటు వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్ ఎస్.వి.కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామప్రసాద్ మౌఖిక ఆదేశాలతో అక్రమాలను గుర్తించకుండా సాఫ్ట్‌వేర్​లో మార్పులు చేసినట్లు విచారణలో గుర్తించారు. ఐజీఎస్టీలో అక్రమాలను గుర్తించకుండా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసిన కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను వాణిజ్య పన్నుల శాఖ వివరణ కోరింది. సోమేశ్‌ కుమార్ ఆదేశాలతోనే తాము సాఫ్ట్‌వేర్‌లో మార్పు చేయాలని సూచించినట్లు వారు వివరణ ఇచ్చారు.

అక్రమాలకు 'స్పెషల్‌ ఇనిషియేటివ్స్‌' వాట్సాప్‌ గ్రూప్‌ : వాణిజ్యపన్నుల శాఖకు సంబంధించి తామెలాంటి సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయలేదని ప్లియాంటో టెక్నాలజీస్ సంస్థ వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తమ శాఖకు, ఐఐటీ హైదరాబాద్‌తో జరిగిన ఒప్పందం గురించి మరింతలోతుగా వివరాలు రాబట్టేందుకు జనవరి 25న స్టేట్ ఆడిట్ డిపార్ట్​మెంట్ డైరెక్టర్‌కు వాణిజ్యపన్నులశాఖ ఉన్నతాధికారులు లేఖ రాశారు. పలు లోపాలున్నట్లు ఆడిట్ డిపార్ట్​మెంట్ నివేదిక ఇచ్చింది. డేటా అంతా ఐఐటీ హైదరాబాద్ నియంత్రణలోనే ఉందని, డేటాలో అవసరమైనప్పుడు మార్పులు చేసేందుకు అవకాశముందని వెల్లడించింది. మరోవైపు ఐఐటీ హైదరాబాద్ నిర్వహణలో ఉన్న డేటాబేస్, ఆడిట్ అప్లికేషన్ల గురించి సీడాక్ నుంచి సైతం వాణిజ్యపన్నుల శాఖ నివేదిక తెప్పించింది.

ఈ నేపథ్యంలో సీడాక్, ఐఐటీ హైదరాబాద్, వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారుల మధ్య జనవరి 30న ఒక సమావేశం జరిగింది. 'స్పెషల్ ఇనిషియేటివ్స్' పేరిట ఏర్పాటైన వాట్సప్ గ్రూప్ నుంచి ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్‌ శోభన్‌బాబుకు తరచూ ఆదేశాలు వచ్చేవని ఆ సమావేశంలో వెల్లడైంది. ఆ గ్రూప్‌లో సోమేశ్‌కుమార్, కాశీ విశ్వేశ్వరరావు, శివరామప్రసాద్ సభ్యులుగా ఉన్నట్లు తేలింది. వాట్సప్ గ్రూప్ ఏర్పాటుపై వాణిజ్యపన్నులశాఖ కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్‌ల వివరణ కోరింది. సోమేశ్‌ కుమార్ పర్యవేక్షణలోనే ఏర్పాటైన ఆ గ్రూపును 2022 డిసెంబరులో నిలిపివేశామని వారిద్దరు సమాధానమిచ్చారు.

పన్ను ఎగవేతకు సహకరించేందుకే : ఫొటోలు, వీడియోలు లేకుండా వాట్సప్ చాట్ హిస్టరీలనూ వారు సమర్పించారు. అయితే 2024 ఫిబ్రవరి వరకు ఆ వాట్సప్ గ్రూపులో కార్యకలాపాలు నడిచాయని తేలడంతో ఫొటోలు, వీడియోలతో కూడిన చాట్ హిస్టరీని సమర్పించాలని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు వారిద్దరికి అత్యవసర మెమో జారీచేశారు. వారు సమర్పించిన హిస్టరీలో పలు అంశాలు గుర్తించారు. ఐజీఎస్టీ నష్టాలకు సంబంధించిన పలు నివేదికలను వాటిలో గుర్తించారు. అలాగే జీఎస్టీ చెల్లింపుల్లో అక్రమాల కేసుల్లోనూ రిజిస్ట్రేషన్లను రద్దు చేయొద్దనే ఆదేశాలున్నట్లు తేలింది. వారిద్దరి సెల్‌ఫోన్లను ఉన్నతాధికారులు జప్తు చేశారు. వారిద్దరు హైకోర్టును ఆశ్రయించగా వారి పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

మరోవైపు ఫోరెన్సిక్ ఆడిట్ సక్రమంగా జరిగేలా చూసేందుకు ప్రాజెక్టు ఇన్వెస్టిగేటర్‌ను మార్చాలని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్‌కు వాణిజ్య పన్నుల శాఖ లేఖ రాసింది. అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎప్పటికప్పుడు ఇచ్చిన సూచనల మేరకే తాము నడుచుకున్నామని పేర్కొంటూ అందుకు సంబంధించిన కొన్ని ప్రతుల్ని వాణిజ్యపన్నులశాఖకు ఐఐటీ హైదరాబాద్ పంపించింది. ఎస్జీఎస్టీ, సీజీఎస్టీలకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటీసుల గురించి మాత్రమే ఆ ప్రతుల్లో ఉన్నట్లు తేలింది. కాశీవిశ్వేశ్వరరావు చెప్పినట్లు ఐజీఎస్టీకి సంబంధించి లేకపోవడం గమనార్హం. ఫోరెన్సిక్ ఆడిట్‌కు సంబంధించి సీడాక్ తుది నివేదిక ప్రకారం 75 మంది పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన కార్యకలాపాలను ఉద్దేశపూర్వకంగా ఆన్‌లైన్‌లో కనిపించకుండా చేసినట్లు గుర్తించారు. పన్ను ఎగవేతకు సహకరించేందుకే ఇలా చేసినట్లు తేలింది.

Last Updated : Jul 29, 2024, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.