ETV Bharat / state

ర్యాష్​ డ్రైవింగ్​ - వాహనాలపైకి దూసుకెళ్లిన కారు - వీడియో వైరల్

కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన డ్రైవర్ - ముగ్గురికి స్వల్ప గాయాలు, పలు వాహనాలు ధ్వంసం - ఘటన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు

Car Rash Driving in Hyderabad
Car Rash Driving in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 9 hours ago

Car Rash Driving in Hyderabad : ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు డ్రైవింగ్ చేస్తూ పలు వాహనాలను ఢీకొట్టి రోడ్డుపై హల్​చల్ చేశాడు. ఈ ఘటన​ హైదరాబాద్​లోని హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో మల్లెపల్లి అన్వర్ ఉలూమ్ కాలేజ్ వద్ద ఓ టయోటా కారు యాజమాని రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్​ చేస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశాడు.

కారు ర్యాష్ డ్రైవింగ్​లో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. అలాగే నాలుగైదు వాహనాలు ధ్వంసమయ్యాయి. అక్కడి స్థానికులు ఈ ఘటనను చూస్తుండగానే అతడు కారు రివర్స్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సినీఫక్కీ తరహాలో బైక్​పై రెచ్చిపోయిన యువ జంట.. వీడియో ఇదిగో!

ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ - వీడియో వైరల్ - RTC Driver Rash Driving in Podili

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.