CAG Report on Telangana 2024 : రాష్ట్రం రెవెన్యూ రాబడులు గణనీయంగా పెరిగాయని కాగ్ నివేదికలో వెల్లడించింది. 2023-24 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేసింది. రాష్ట్ర జీఎస్డీపీ 2021-22తో పోలిస్తే 2022-23లో 16శాతం పెరిగిందని పేర్కొంది. రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు ఒక శాతం తగ్గిందని వెల్లడించింది. సొంత పన్నుల రాబడి గణనీయంగా 17శాతం పెరిగిందని తెలిపింది.
కొన్ని పథకాల నిధుకు ఖర్చు కాలే : సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.2,06,977 కోట్లకు పెరిగిందని, 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సిన 20 ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగిందని వెల్లడించింది. రూ.2,749 కోట్ల మేర ద్రవ్యలోటు తక్కువ చేసి చూపించారని వివరించింది. ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్ కంపెనీలకు బకాయిలు రాలేదని నివేదికలో తెలిపింది. ఇళ్లు, గొర్రెల పంపిణీ, ఆయిల్‌పామ్ పథకాల నిధులు ఖర్చు కాలేదని స్పష్టం చేసింది. దళితబంధు, రుణమాఫీ పథకాలకు కేటాయింపుల్లో భారీగా ఖర్చు కాలేదని వెల్లడించింది.
'2022-23లో ప్రభుత్వం ఇచ్చిన రుణాలు, అడ్వాన్స్‌లు 150 శాతం పెరిగాయి. సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వం రుణాలు ఏర్పాటు చేసింది. 2022-23లో బడ్జెట్ వెలుపలి రుణాలు రూ.1,18,629 కోట్లుగా అంచనా. ఆయా రుణాలకు ప్రభుత్వం తదుపరి రుణాలుగా రూ.17,829 కోట్లు అందించింది. రాష్ట్రాభివృద్ధి రుణాలపై వడ్డీపై ఖర్చు తక్కువగా అంచనా వేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను భారీగా అంచనా వేస్తున్నారు.' అని కాగ్ నివేదికలో పేర్కొంది.
బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతిపక్షాలు : కాగ్ నివేదిక ప్రవేశపెట్టిన అనంతర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రానికి పేరు తెచ్చిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్‌కు గ్రూప్-1 ఉద్యోగాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. సవరణ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరారు. ప్రభుత్వం తెచ్చిన పబ్లిక్ సర్విస్ నియామకలపై తెచ్చిన బిల్లులకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. ప్రతి మండల కేంద్రంలో క్రీడామైదానం ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. నిఖత్, సిరాజ్ రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తెచ్చారని ఎంఐఎం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా ఉండాలి వారు కోరారు.
ఏంటీ! అంబులెన్సులు, ఆటోలు, బైకుల్లో 'గొర్రెల పంపిణీ' చేశారా? - కాగ్ సంచలన రిపోర్ట్
రాష్ట్రానికి పెనుభారంగా మారనున్న కాళేశ్వం ప్రాజెక్ట్ - కాగ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు