Budget Allocation for Six Guarantees in Telangana 2024 : అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఎన్నికల సమయంలో గ్యారంటీల జల్లు కురిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. అందులో రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి రూ.723 కోట్లు కేటాయించింది. అలాగే గృహజ్యోతి పథకానికి రూ.2,418 కోట్ల నిధులు మంజూరు చేసింది.
గృహజ్యోకి పథకానికి ఎంతంటే? : అల్పాదాయ కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించడానికి తీసుకొచ్చిన గృహజ్యోతి పథకం ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని, 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ ఉపయోగించే ఇళ్లకు ఉచిత కరెంట్ అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా వచ్చి దరఖాస్తులను తీసుకుని అర్హులైన వారందరికి ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
జులై 15నాటికి 45,81,676 గృహాలకు ఉచిత విద్యుత్‌ను అందించామని, ఈ పథకం కింద జూన్ వరకు సప్లై చేసిన విద్యుత్‌కు డిస్కంలకు ప్రభుత్వం అందించిన మొత్తం రూ.585.05 కోట్లుగా వివరించారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో ఈ స్కీమ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,148 కోట్లు ప్రతిపాదించింది.
బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి పెద్దపీట - రూ.72,659 కోట్లు కేటాయింపు - telangana budget 2024 highlights
రూ.500కే గ్యాస్ సిలిండర్ : నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల తరచుగా పెరిగే గ్యాస్ సిలిండర్ ధరలు మోయలేని భారంగా మారాయని, వారి ఆదాయంతో పోలిస్తే పెరిగిన సిలిండర్ ధర వారికి ఒక ఆర్థిక సమస్యగా భావించి రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. మహాలక్ష్మి పథకం కింద రూ.500కే వంటగ్యాస్ సిలిండర్‌ను అందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 39,57,637కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఈ పథకానికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.200 కోట్లు వెచ్చించగా తాజాగా బడ్జెట్‌లో రూ.723 కోట్లు కేటాయించింది.
ఇందిరమ్మ ఇళ్లు : పూటగడవని నిరుపేదలకు గూడును సమకూర్చడం ప్రభుత్వం కర్తవ్యంగా భావించి ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం ప్రారంభించింది. ఈ పథకం నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇళ్లు కట్టుకోడానికి పేదలకు రూ.5లక్షల ఆర్థిక సహాయం చేస్తుంది. ఎస్టీ, ఎస్సీ లబ్ధిదారులకు రూ.6లక్షల సహాయం అందించనుంది.
రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ - ఏయే శాఖకు ఎంత కేటాయించారంటే? - TELANGANA BUDGET 2024
హైదరాబాద్‌పై స్పెషల్ నజర్ - ఏకంగా రూ.10వేల కోట్ల కేటాయింపులు - HYDERABAD DEVELOPMENT BUDGET 2024