Buddha Venkanna Fires on YS Jagan : తిరుమలను స్వార్థ రాజకీయాల కోసం జగన్ వాడుతున్నారని తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనానికి వెళ్తానన్న జగన్ తనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బైబిల్ చదువుకునే జగన్ వేంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందనే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. నిబంధనల మేరకు డిక్లరేషన్ అడిగితే రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ భార్యను తీసుకుని తిరుమల ఎందుకు వెళ్లలేదని విమర్శించారు. కల్తీ నెయ్యిలో జగన్ పాత్ర ఉందని, అందుకే వైవీ సుబ్బారెడ్డిని వెనుకేసుకొస్తున్నారని ఆరోపించారు. తిరుమలలో అపవిత్రం చేసి చంద్రబాబుపై విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు.
జగన్ తిరుమల పర్యటన రద్దు వెనుక నాటకీయ పరిణామాలు - Jagan Tirupati Tour
కలుగులో దాక్కున్న వంశీ, కొడాలి నానిలు ఇప్పుడు బయటకు వచ్చారని విమర్శించారు. మొక్కుబడులు ఉంటే తల నీలాలు ఇస్తారన్న బుద్దా వెంకన్న, ఈ విషయం కూడా తెలియకుండా చంద్రబాబు గుండు కొట్టించుకుంటారా అని జగన్ అడిగాడని మండిపడ్డారు. చంద్రబాబు ప్రతి యేడాది కోటి రూపాయలు విరాళం ఇస్తారని, జగన్ ఒక్క రూపాయి అయినా విరాళం ఇచ్చాడా అని ప్రశ్నించారు. నిన్ను స్వామివారే ఆపారు, నువ్వు రావడం ఆయనకు ఇష్టం లేదని అన్నారు. మొదటి జాబితాలో నీపేరు లేదని కొంతమంది వాగుతున్నారని, లిస్ట్‌లతో తనకు పని లేదు, తన గుండెల్లో చంద్రబాబు ఉంటారని అన్నారు. తనకు పదవులు ఇస్తే ఇంకా పని చేస్తా, తానైతే పార్టీ కోసం, చంద్రబాబు, లోకేశ్‌కు భక్తుడిగా ఉంటానని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లడం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని, అందుకే ఆయన తిరుమల ప్రయాణం రద్దు చేసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఆ విషయం బయటకు చెప్పకుండా స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసిచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు నోటీసిచ్చి ఉంటే మీడియాకు చూపించాలన్నారు.
జగన్‌ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరన్నారు? : సీఎం చంద్రబాబు - CM Chandrababu on YS Jagan