Brutal Murder in Tirupati: ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి ముగ్గురిని హత్య చేసి, ఆత్మహత్య చేసుకోవడం తిరుపతి పద్మావతి నగర్‌లో కలకలం రేపుతోంది. పద్మావతి వర్సిటీ సమీపంలోని పద్మావతి నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వదిన సునీతను హత్య చేసిన మరిది మోహన్ ఆపై 8, 6వ తరగతి చదువుతున్న ఆమె ఇద్దరు పిల్లలు దేవీశ్రీ, నీరజలను హతమార్చాడు. అనంతరం మోహన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మోహన్ చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్ సిబ్బంది హత్యలు జరిగిన చోట ఆధారాలు సేకరిస్తున్నారు. తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ సుబ్బరాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టామని ఏఎస్పీ కులశేఖర్ తెలిపారు.
ఆరోజు ఏం జరిగిందంటే: పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం తిరుపతి పద్మావతి నగర్‌లోని ఓ ఇంట్లో టీపీ దాస్ అనే వ్యక్తి నివసిస్తున్నారు. దాసు తమ్ముడు మోహన్ (35) సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 2019లో మోహన్‌కు వివాహం అయింది. అయితే కొన్ని కారణాలతో 2020లో దంపతులు విడిపోయారు. ఇటీవల అన్నావదినలు మోహన్‌కి రెండో పెళ్లి చేశారు. అయితే ఆ అమ్మాయి కూడా మోహన్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయింది. దీంతో అతను మానసికంగా కుంగిపోయాడు.
బుధవారం తన దాసు నివాసంలో సాయంత్రం అన్నతో కలిసి మోహన్ మద్యం తాగాడు. అనంతరం దాసు బయటికి వెళ్లాడు. అప్పుడే ట్యూషన్ నుంచి వచ్చిన దాసు కుమార్తెలు దేవశ్రీ (13), నీరజ (10), భార్య సునీత (40)లను మోహన్ కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. వారంతా రక్తం మడుగులో ఉండగా, వారి మృతదేహాలను బయటికి తరలించేందుకు యత్నించాడు. అయితే చుట్టుపక్కల ప్రజలు బయటే తిరుగుతుండటంతో భయంతో ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. మోహన్ అన్న దాసు ఇంటికి వచ్చేసరికి లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో, తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా భార్యాపిల్లలు హాలులో రక్తం మడుగులో పడి ఉన్నారు.
లోపలి గదిలో మోహన్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హత్యకు దారి తీసిన పరిణామాలు తెలియని నేపథ్యంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అప్పటి వరకు అన్నతో మద్యం తాగిన తమ్ముడు, ఆయన బయటకు వెళ్లిన కొద్దిసేపటికే ఈ దారుణానికి పాల్పడటంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పిల్లనిచ్చిన మామను హతమార్చిన అల్లుడు - కారణం తెలిస్తే షాక్ అవుతారు - Son In Law Killed Uncle