ETV Bharat / state

కేసీఆర్​ ప్లాన్​​ ఛేంజ్​ - బహిరంగ సభలకు బైబై - బస్సు యాత్రలు, రోడ్​ షోలతోనే ఎన్నికల ప్రచారం - Lok Sabha Election 2024

BRS Lok Sabha Election Campaign 2024 : బహిరంగ సభలు కాకుండా బస్సు యాత్రలు, రోడ్ షోల ద్వారా లోక్​సభ ఎన్నికల కోసం ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ సిద్ధమవుతున్నారు. కరీంనగర్‌లో కదనభేరి మోగించిన గులాబీ పార్టీ మరో ఒకటి, రెండు సభలు మాత్రమే నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 11 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఆర్​ఎస్​ మిగిలిన అభ్యర్థులను కూడా త్వరలోనే ఖరారు చేయనుంది.

BRS Election Campaign
KCR Road Show For Lok Sabha Election Campaign
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 17, 2024, 9:07 AM IST

కేసీఆర్​ ప్లాన్​​ ఛేంజ్​ - బస్సు యాత్రలు, రోడ్​ షోలతోనే ఎన్నికల ప్రచారం

BRS Lok Sabha Election Campaign 2024 : శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలై రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన భారత్ రాష్ట్ర సమితి లోక్​సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. గత లోక్​సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్​ఎస్​ ఈ మారు గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు గెలవాలని భావిస్తోంది. ఇప్పటికే లోక్​సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించి పార్టీ నేతలను ఎన్నికలకు సన్నద్ధం చేశారు. వాటికి కొనసాగింపుగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కూడా పార్టీ విస్తృతస్థాయి సమావేశాలు జరిగాయి. శాసనసభ సమావేశాలు, ఇతర కారణాలవల్ల మిగిలిన కొన్ని నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు జరగలేదు.

లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థిత్వాలపై ఆయా నియోజకవర్గాల వారీగా అధినేత కేసీఆర్ (KCR Election Campaign 2024) కూడా సమావేశమై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కోసం గులాబీ పార్టీ ఇప్పటికే కదనభేరి మోగించింది. పార్టీకి సెంటిమెంట్‌గా వస్తున్న కరీంనగర్ ఎస్​ఆర్​ఆర్​ కళాశాల మైదానంలో బహిరంగ సభను నిర్వహించి కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దానికి కొనసాగింపుగా వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు సభలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.

మరో రెండు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్​ఎస్​ - మల్కాజిగిరి బరిలో లక్ష్మారెడ్డి

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువగా సభలు ఉండకుండా బస్సు యాత్రలు, రోడ్ షోల (BRS Road Show For Lok Sabha Election) ద్వారా ప్రచారం నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ తరహా ప్రచారంతో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లవచ్చని భావిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలు నెరవేరాలంటే లోక్​సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు. ప్రశ్నించే గొంతుకగా తమ పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వాలని కోరనున్నారు.

RS Praveen Likely To Join In BRS : లోక్‌సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్​ ఇప్పటికే 11 మంది పేర్లను ప్రకటించింది. మిగిలిన ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. నాగర్​కర్నూల్ నుంచి విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆయన భవిష్యత్‌లో కేసీఆర్, బీఆర్​ఎస్​ వెంట కలిసి నడుస్తానని ప్రకటించారు. దీంతో ఆయన గులాబీ కండువా కప్పుకొని నాగర్​కర్నూల్ నుంచి లోక్‌సభ బరిలో దిగుతారన్న సమాచారం గట్టిగా వినిపిస్తోంది.

మెదక్ నుంచి వంటేరు ప్రతాప్​రెడ్డి పేరు దాదాపుగా ఖరారు అయినట్లు సమాచారం. నల్గొండ, భువనగిరి, సికింద్రాబాద్ స్థానాల్లో అభ్యర్థిత్వాల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదని అంటున్నారు. నల్గొండ, భువనగిరిలో అభ్యర్థుల ఖరారు ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లోనే మిగిలిన అభ్యర్థుల ప్రకటన ఉంటుందని నేతలు చెబుతున్నారు.

గత 30 ఏళ్లలో పూర్తికాని ప్రాజెక్టులను కేసీఆర్​ పాలనలో నాలుగేళ్లలోనే పూర్తి చేశాం : హరీశ్​రావు

కాంగ్రెస్‌ పాలన చూస్తే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది: కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.