ETV Bharat / state

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు - కవిత ఈడీ కస్టడీ మరో మూడ్రోజులు పొడిగింపు - BRS Leader Kavitha ED Custody - BRS LEADER KAVITHA ED CUSTODY

BRS Leader Kavitha ED Custody Extended : దిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. మరో ఐదు రోజుల పాటు ఆమెను కస్టడీకి కోరగా మూడ్రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.

BRS Leader Kavitha ED Custody Updates
BRS Leader Kavitha ED Custody Updates
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 23, 2024, 12:51 PM IST

Updated : Mar 23, 2024, 1:39 PM IST

BRS Leader Kavitha ED Custody Extended : దిల్లీ మద్యం కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. విచారణ నిమిత్తం గతంలో వారం రోజుల పాటు కోర్టు ఇచ్చిన కస్టడీ నేటితో ముగియడంతో ఇవాళ మరోమారు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఆమెను అధికారులు హాజరుపరిచారు. కవితను మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించిన ఈడీ న్యాయవాది, కస్టడీ పొడిగిస్తే దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు మరికొందరిని కవితతో కలిసి విచారించనున్నట్లు చెప్పారు.

Kavitha ED Custody Ended : కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించిన ఈడీ న్యాయవాది, కవిత కుటుంబ సభ్యులకు సంబంధించి వివరాలు వెల్లడించ లేదని చెప్పారు. కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. మద్యం కేసులో సమీర్ మహేంద్రును విచారించాల్సి ఉందని, మేకా శరణ్ నివాసంలో సోదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆయన దర్యాప్తునకు సహకరించడం లేదని వెల్లడించారు.

కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు (ED On Kavitha Custody), వైద్యులు సూచించిన ఆహారాన్నే ఇస్తున్నామని వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కవిత కస్టడీని మరో మూడు రోజులు పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. ఈ నెల 26వ తేదీ వరకు ఆమె ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఈడీ అధికారులు ఐదు రోజుల కస్టడీని కోరగా రౌస్ అవెన్యూ కోర్టు మూడ్రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది.

ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లల్లో ఈడీ సోదాలు - బీఆర్​ఎస్​ శ్రేణుల్లో టెన్షన్​, టెన్షన్ - Delhi Liquor Scam Updates

మద్యం కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఇప్పటికే కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ (Kejriwal ED Custody), కవితను ఒకేసారి ప్రశ్నించే యోచనలో ఈడీ అధికారులు ఉన్నారు. ఇద్దరినీ కలిపి ప్రశ్నించేందుకు కవిత కస్టడీ పొడిగింపు కోరగా కోర్టు అనుమతించింది. మరోవైపు సీబీఐ కోర్టులో కవిత తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ (Kavitha Bail Petition) దాఖలు చేశారు. వెంటనే ఈడీకి నోటీసులు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో కోరారు. మరోవైపు కోర్టుకు వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడారు. తనను ఈడీ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. తనపై పెట్టిన కేసులపై న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు.

ప్రాంతీయ పార్టీలను లొంగదీసుకోవాలనే ఈడీతో కేంద్రం దాడులు చేయిస్తోంది : బీఆర్​ఎస్​ ఎంపీలు - BRS MPs On MLC Kavitha Arrest

కేజ్రీవాల్​ అరెస్ట్​ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు : కేసీఆర్ - KCR Reaction On Kejriwal Arrest

Last Updated : Mar 23, 2024, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.