ETV Bharat / state

రేవంత్ రెడ్డి జాక్​పాట్ సీఎం - తెలంగాణ ఉద్యమం గురించి ఆయనకేం తెల్వది : కేటీఆర్‌ - KTR Speech on TG Formation Day - KTR SPEECH ON TG FORMATION DAY

BRS Telangana Formation Day Celebrations 2024 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్​లో బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు జాతీయ జెండా ఎగరవేశారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు నివాళులు అర్పించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే ఈ దశాబ్ది ఉత్సవాలను నెల రోజుల పాటు వేడుకగా జరిపేవారిమని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమ ఘటనలను గుర్తు చేసుకున్నారు.

BRS Celebrates TG Formation Day 2024
KTR Latest Tweet (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 2, 2024, 11:59 AM IST

Updated : Jun 2, 2024, 12:25 PM IST

మేమే అధికారంలో ఉంటే దశాబ్ది సంబురాలు నెలరోజులు నిర్వహించేవాళ్లం కేటీఆర్‌ (ETV Bharat)

BRS Celebrates TG Formation Day 2024 : రేవంత్ రెడ్డి జాక్ పాట్ ముఖ్యమంత్రి అని, ఆయనకు తెలంగాణ ప్రజల త్యాగాలు, ఉద్యమం గురించి ఏమాత్రం తెలియదని బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్​లో జాతీయ జెండా, పార్టీ జెండాను ఆయన ఎగరవేశారు. అనంతరం పట్టుదలతో, నిబద్ధతతో ప్రయాణం చేసి గమ్యాన్ని ముద్దాడిన ఒకే ఒక్కరు మాజీ సీఎం కేసీఆర్ అని తెలిపారు.

పాకిస్థాన్ తరహాలో బీఆర్ఎస్​ ముందు రోజు వేడుకలు నిర్వహించారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తాము ప్రభుత్వంలో ఉంటే నెల రోజుల పాటు సంబురాలు నిర్వహించే వారమని, దశాబ్ది ఉత్సవాలను కేవలం ఒక్క రోజుకే పరిమితం చేశారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్​ రెడ్డి తన శుభాకాంక్షల సందేశంలో జై తెలంగాణ అనలేదని కేటీఆర్ ఆక్షేపించారు.

గన్‌పార్క్ నుంచి అమరజ్యోతి వరకు బీఆర్ఎస్‌ క్యాండిల్‌ ర్యాలీ - అమరులకు అంజలి ఘటించిన కేసీఆర్‌ - BRS Candle Rally 2024

"దశాబ్ద కాలం పాటు ప్రత్యేక తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించింది. తెలంగాణ ఆచరించిందే, దేశం అనుసరిస్తుందనే విధంగా ఆదర్శంగా నిలిచింది. 25 ఏళ్లలో కేసీఆర్​తో కలిసి నడుస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను." - కేటీఆర్, బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

KTR Comments on CM Revanth Reddy : తెలంగాణ ఆవిర్భావం జరిగి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ తరపున, 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున రాష్ట్ర ప్రజలందరికీ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు, చివరికి ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ నివాళులు అర్పించారు. 2001లో మలి దశ ఉద్యమంతో కొత్త విప్లవాన్ని సృష్టించి, చరిత్రను మలుపు తిప్పి, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజల ఆకాంక్షను పురుడు పోసింది మాజీ సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.

KTR Tweet on Telangana Movement : స్వాతంత్య్రం ఇవ్వలేదు తీసుకున్నామన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యను కేటీఆర్ ఎక్స్​ ఖాతాలో ట్వీట్​ చేశారు. 2001లోనే తొలి సభలో దిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధిస్తామని ప్రకటించాలంటే ఎంత ధైర్యం కావాలి? ఉద్యమబాట వీడితే రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునివ్వాలంటే పుట్టిన మట్టిపై ఎంత ప్రేమ ఉండాలి? అసాధ్యం అనుకునే ఒక స్వప్నాన్ని, సుసాధ్యం చేసి చూపిస్తామని చెప్పిన మాట ఉక్కు సంకల్పానికి నిదర్శనం. నడి మధ్యలో కాడి పారేసి పారిపోయిన ఉత్తుత్తి ఉద్యమకారులు, నకిలీ నాయకులు ఎందరో? కానీ పట్టుదలతో నిబద్ధతతో ప్రయాణించి గమ్యాన్ని ముద్దాడిన ఉక్కు సంకల్పం కేసీఆర్​కు సొంతం అని కేటీఆర్ ట్వీట్​ చేశారు.

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు - నేడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన సభ - BRS Telangana Formation Day

Last Updated : Jun 2, 2024, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.