Telangana Police Constable Vacancies Report : రాష్ట్రంలో 615 మంది పౌరులకో పోలీస్ ఉన్నట్లు పోలీస్ పరిశోధన, అభివృద్ధి సంస్థ (బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) తాజా గణాంకాలు వెల్లడించాయి. నిజానికి 442 మంది సిటిజన్స్‌కు ఒకరు, అంటే లక్ష మంది పౌరులకు 226 మంది ఉండాలి. కానీ 163 మంది మాత్రమే ఉన్నట్లు తేలింది.
గతేడాది జనవరి 01 నాటికి దేశవ్యాప్తంగా పోలీస్‌శాఖ స్థితిగతులపై బీపీఆర్‌డీ తాజా నివేదిక వెలువరించింది. రాష్ట్ర పోలీస్‌శాఖలో అన్ని సెక్షన్లలో కలిపి 24,247 ఖాళీలున్నట్లు పేర్కొంది. తెలంగాణకు 139 ఐపీఎస్ పోస్టులు మంజూరు కాగా, అందులో 122 మంది ఉన్నట్లు వెల్లడైంది.
రవాణా సదుపాయంలో ముందంజ : దేశవ్యాప్తంగా చూసుకుంటే 77 పోలీస్ కమిషనరేట్లున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 12 ఉండగా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు తొమ్మిది చొప్పున కమిషనరేట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. 33 పోలీస్ శిక్షణ సంస్థలతో రాష్ట్రం ప్రథమస్థానంలో నిలిచింది.
1,12,122.4 చ.కి.మీ.లతో విస్తరించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 1.3 కి.మీ.ల పరిధికి ఒకరు అవసరం కాగా, 1.81 కి.మీ.లకు ఒక పోలీస్ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ల సంఖ్య 844. మొత్తం పోలీసు శాఖకు 19,982 వెహికల్స్ ఉండగా, వీటిలో ఠాణాల్లో 5966 మాత్రమే ఉన్నాయి. ప్రతి 100 మంది పోలీసులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పిస్తున్న విషయంలో తెలంగాణ ముందంజలో ఉంది.
ఉన్నత స్థాయిలో అదనం - క్షేత్రస్థాయిలో అథమం : రాష్ట్రంలో డీజీపీ పోస్టులు రెండుకు గాను ఒకటి అదనంగా ఉండటం విశేషమనే చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే 6 అదనపు డీజీపీలకు 17 మంది ఉన్నారు. 16 ఐజీలకు 8 మంది, 17 మంది డీఐజీలకు 12 మంది కలరు. 104 మంది ఏఐజీ/సీనియర్ ఎస్పీ/ఎస్పీ/కమాండెంట్ పోస్టులకు నలుగురు చొప్పున అదనంగా ఉన్నారు.
112 మంది అదనపు ఎస్పీ/డిప్యూటీ కమాండెంట్ పోస్టులకు 86 మంది, 387 ఏఎస్పీలకు 352, 1375 మంది సీఐలకు 1217 మంది, 3832 మంది సబ్ ఇన్స్పెక్టర్లకు 2997 మంది, 2654 మంది ఏఎస్సైలకు 2481 మంది, 7616 హెడ్‌కానిస్టేబుళ్లకు 6199 మంది, 32,747 మంది కానిస్టేబుళ్లకు 22161 మంది అథమంగా ఉన్నారు.
5351 Women Policemen in Telangana : మహిళా పోలీస్ అధికారుల్లో సివిల్ విభాగంలో డీజీపీ కేడర్‌లో ఒక్కరూ లేరు. ఆరుగురు అదనపు డీజీపీలు, ఒక్కో ఐజీ, డీఐజీ. 29 మంది ఎస్పీలు, 13 మంది అదనపు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 27 మంది సీఐలు. 372 మంది సబ్ ఇన్స్పెక్ట్ర్లు, 198 మంది ఏఎస్సైలు, 320 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 2907 మంది కానిస్టేబుళ్లున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 61,811 మంది పోలీసులు ఉండగా, అన్ని సెక్షన్‌ల్లో కలిపి 5351 మంది మహిళా పోలీసులున్నారు. రాష్ట్రంలో ప్రతి 3530 మంది ఆడవారికి ఓ మహిళా పోలీస్ ఉన్నట్లు, అలానే 16 మహిళా ఠాణాలు ఉన్నాయని నివేదికలో వెల్లడించారు.