ETV Bharat / state

ఏలూరులో ప్రేమోన్మాది ఘాతుకం - ప్రేమించలేదని యువతిని నరికి చంపిన యువకుడు - Boyfriend killed his Girlfriend

Young Man Brutally killed Young Woman for Rejecting Love: ఏలూరులో ప్రేమ పేరుతో ఓ యువకుడు రెచ్చిపోయాడు. ప్రేమను అంగీకరించలేదనే పగతో కత్తితో దాడిచేసి యువతిని పొట్టన పెట్టుకున్నాడు. అనంతరం అదే కత్తితో తానూ ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలతో పోరాడుతున్నాడు.

boyfriend_killed_girlfriend
boyfriend_killed_girlfriend (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 3:05 PM IST

Updated : May 30, 2024, 8:21 PM IST

Young Man Brutally killed Young Woman for Rejecting Love: సమాజంలో రోజురోజుకు ఆడవారిపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. మహిళలు కనిపిస్తే చాలు క్రూరమృగాలుగా మారి అఘాయిత్యాలకు పాల్పడుతున్నవారు కొందరు. వావి వరసలు మరిచి అత్యాచారాలకు తెగబడుతున్నవారు మరికొందరు. ప్రేమిస్తున్నామంటూ వెంట పడతారు అమ్మాయి ఒప్పుకోకపోతే ఎంతకైనా తెగిస్తారు. తనకు అమ్మాయి దక్కలేదనే కక్షతో దాడులకు తెగబడుతున్నారు. అంతేకాదు ప్రాణాలు సైతం తీసేందుకు వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఏలూరు పట్టణంలో జరిగింది.

ఏలూరులో ప్రేమోన్మాది ఘాతుకం (ETV Bharat)

ప్రేమించాలంటూ వేధింపులు: ఏలూరు ఎమ్మార్సీ కాలనీలో దారుణం జరిగింది. ప్రేమిస్తున్నానంటూ ఓ యువతి వెంట యువకుడు పడ్డాడు. అతడి ప్రేమను ఆమె నిరాకరించింది. దీంతో తనతో తెచ్చుకున్న పదునైన కత్తితో దారుణంగా నరికి చంపాడు. ఎమ్మార్సీ కాలనీకి చెందిన జక్కుల రత్న గ్రేస్ అనే యువతిని తొట్టిబోయిన ఏసురత్నం అనే యువకుడు కొంత కాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం యువతి తన ఇంటి సమీపంలో ఉండగా ఆమె వద్దకు వచ్చాడు.

ప్రేమించాలంటూ మరోసారి ఆమెను వేధించాడు. అతని ప్రేమను యువతి నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతి మెడపై పలుమార్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం ఏసురత్నం కూడా అదే కత్తితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏసురత్నాన్ని రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

వేరే మహిళతో భర్త - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మిస్ వైజాగ్ విజేత - Miss Vizag Nakshtra Family Problem

రాజధాని సామగ్రి తరలింపును అడ్డుకున్న సీఆర్డీఏ - గుత్తేదారు సంస్థకు నోటీసులు - CRDA Blocked Material Moving

Last Updated : May 30, 2024, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.