BJP Leader Murder in Adoni : కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలో ఓ బీజేపీ నేతను దుండగులు హతమార్చారు. శేఖన్న అనే వ్యక్తి రాత్రి ఆరుబయట నిద్రపోయాడు. నిద్రలో ఉన్న అతణ్ని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. మృతుడు కొద్దిరోజుల క్రితం వైఎస్సార్సీపీని వీడి ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో కమలం పార్టీలో చేరారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
ఆదోని డీఎస్పీ సోమన్న, తాలూకా సీఐ నల్లప్ప, ఐఎస్‌వీఐ ఎస్సై నాగేంద్ర హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శేఖన్నకు గ్రామంలో ఎలాంటి విభేదాలు లేవని స్థానికులు తెలిపారు ఆయన్ను హత్య చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని చెప్పారు.
నంద్యాల జిల్లాలో దారుణం - కర్రలతో దాడి చేసి టీడీపీ నేత హత్య - TDP ACTIVIST BRUTAL MURDER