ETV Bharat / state

త్వరలోనే అందుబాటులోకి 'భూ భారతి' - వారం, పది రోజుల్లో లక్షకు పైగా సమస్యల పరిష్కారం - TG GOVT ON Dharani Portal Issues - TG GOVT ON DHARANI PORTAL ISSUES

Bhubharathi Portal in Telangana : ధరణి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం, మరో వారం, పది రోజుల్లో లక్షకు పైగా రైతు సమస్యలు పరిష్కారం చేయనుంది. మిగిలిన సమస్యల పరిష్కారానికి వివిధ రకాల అడ్డంకులు ఎదురవుతుండడంతో ధరణి కమిటీ లోతైన అధ్యయనం చేస్తున్నది. వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. గత ప్రభుత్వం తెచ్చిన ఆర్వోఆర్‌ చట్టం స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. పదుల సంఖ్యలో ఉన్న ఇతర భూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే దిశలో చర్యలు తీసుకుంటోంది.

Bhubharathi Portal in Telangana
TG GOVT ON Dharani Portal Issues (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 10:46 AM IST

Bhubharathi Portal in Telangana : ధరణి పోర్టల్‌ స్థానంలో భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలో ధరణి పోర్టల్‌ తీసుకొచ్చిన తర్వాత లక్షలాది మంది పట్టాదారు పాస్ పుస్తకాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ పలుమార్లు సమావేశమై చర్చించిన తర్వాత భూ సమస్యలను పరిష్కరించేందుకు గత మార్చి మొదటి వారంలో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. బీఆర్​ఎస్​ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రాష్ట్రంలో భూసమస్యలు ఉత్పన్నమయ్యాయి. కొత్త తరహా పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చినప్పుడు ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ అలాంటిదేమీ చేయకపోవడంతో లక్షలాది మంది భూ సమస్యలతో సతమతమవుతూ వచ్చారు.

Telangana Government on Dharani Portal Issues : గత ప్రభుత్వంలోనే భూ సమస్యల పరిష్కారానికి దాదాపు 2.46 లక్షల దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి మొదటి వారంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో మరో 60 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో భూ సమస్యల పరిష్కారానికి వచ్చిన దరఖాస్తులు మూడు లక్షలు దాటాయి. ధరణి కమిటీ సూచన మేరకు ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఇందులో లక్షకుపైగా సమస్యలు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తి చేసుకుని సీసీఎల్‌ఏకు చేరినట్లు ధరణి కమిటీ సభ్యులు చెబుతున్నారు. వీటికి సంబంధించి ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసే కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఇది పూర్తయితే కానీ ఆ లక్ష మంది రైతులకు చెందిన భూములు ఆన్‌లైన్‌లో కనిపించవు. వారం, పది రోజుల్లో ఈ లక్ష సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతున్నారు.

ధరణి పోర్టల్ ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు - TG Govt Focus on Dharani Problems

Bhubharathi Works to Near Complete : న్యాయస్థానాల్లో పెండింగ్‌ ఉన్నవి, కుటుంబ తగాదాలతో పెండింగ్‌ ఉన్నవి పక్కన పెడితే టీఎం-33 మోడ్యూల్‌ కింద పరిష్కరించాల్సినవి సమస్యలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటిలో ఎక్కువ కలెక్టర్ల స్థాయిలో పరిష్కారమయ్యేవని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి చెబుతున్నారు. పార్ట్‌-బి, సాదాబైనామాలకు చెందిన సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించి భూహక్కులు కల్పించాలంటే కొత్తగా ఆర్​ఓఆర్ చట్టం తీసుకురావాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు 2020లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్వోఆర్‌ చట్టం అమలు చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలు ఏమీ లేకపోవడంతో చట్టం తెచ్చి కూడా ప్రయోజనం లేకుండా పోయినట్లు అధికారులు చెబుతున్నారు.

Land Issues in Telangana : ధరణి చట్టం తీసుకొచ్చినప్పటికీ మండల రెవెన్యూ, డివిజనల్‌ రెవెన్యూ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఎలాంటి సమస్యలు పరిష్కరించాలో ఏ స్థాయి అధికారికి ఏయే అధికారాలు ఉంటాయన్న మార్గదర్శకాలు పొందుపరచలేదు. దీనికి తోడు రెవెన్యూ చట్టాలు పదుల్లో ఉండడంతో భూ సమస్యలు పరిష్కరించేందుకు ఒక చట్టం కింద చర్యలు తీసుకున్నప్పుడు మరొక చట్టం అడ్డు వస్తున్నట్లు ధరణి కమిటీ పరిశీలనలో గుర్తించారు. దీంతో భూచట్టాలు అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని ఈ ప్రభుత్వం యోచిస్తోంది.

ధరణి పోర్టల్‌ ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టాం : మంత్రి పొంగులేటి - Minister Ponguleti on Dharani

Dharani Committee Update News : ధరణి పోర్టల్‌ ద్వారా చోటు చేసుకున్న తప్పిదాల కారణంగా పట్టాదారు రైతు కూడా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. సదరు రైతుకు ప్రభుత్వం నుంచి అందే ఎలాంటి సంక్షేమ ప్రయోజనాలు అందడం లేదు. లక్షలాది మంది ధరణి బాధితులు సమస్యల పరిష్కారం కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఆర్​ఓఆర్ చట్టం తీసుకొచ్చేందుకు ధరణి కమిటీ సభ్యులు కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చట్టానికి సంబంధించిన అంశాలను రెవెన్యూ మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లి పరిశీలన చేసిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు ధరణి కమిటీ సిద్దమవుతోంది. ప్రైవేటు సంస్థ ఆధీనంలో ఉన్న ధరణి పోర్టల్‌ వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వం తీసుకుంటుంది. చట్టం రూపకల్పనలో నిమగ్నమైన ధరణి కమిటీ సభ్యులు ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పరిశీలించిన తర్వాత దానిని పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తారు.

పెండింగ్‌లో 2.06 లక్షల ధరణి దరఖాస్తులు - వేగం పెంచాలని రెవెన్యూ శాఖకు కమిటీ సూచన - Dharani Pending Applications

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.