BANKS FRAUDSTER ARRESTED : అతడో కిలాడీ. దీంతో అతడిని గతంలోనే పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. అనంతరం కోర్టులో కేసు విచారణకు వచ్చింది. తనకు జైలుశిక్ష తప్పదని భావించిన మోసగాడు పోలీసుల కన్నుగప్పి పారిపోయాడు. అడ్రస్ మార్చి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. కానీ ఎట్టకేలకు మూడు సంవత్సరాల తరువాత ఒకే ఒక్క ఆధారంతో పోలీసులు చిక్కాడు.
ఇందుకు సంబంధించిన వివరాలు: తెలంగాణలోని యూసుఫ్‌గూడ రహ్మత్‌నగర్‌కు చెందిన కేఎన్ రంజిత్‌రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేవాడు. తక్కువ సమయంలో డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కాడు. 2016లో నకిలీ ఓటరు ఐడీ, పాన్‌కార్డులను తయారు చేసి సికింద్రాబాద్ రాణిగంజ్‌లోని బ్యాంకు నుంచి 50 లక్షల రూపాయల లోన్ తీసుకున్నాడు. అక్కడ తేలికగా లోన్ రావడంతో వివిధ రకాల పేర్లు, నకిలీ ఐడీ కార్డులతో మరికొన్ని బ్యాంకుల నుంచి భారీ ఎత్తున లోన్లు పొందాడు.
బాత్రూంకు వెళ్లి అక్కడ నుంచి పరార్: మాయగాడిపై పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2016 జులై 30వ తేదీన అదుపులోకి తీసుకొని విచారించగా ఇతడి మోసాలు బయటపడ్డాయి. దీనిపై కేఎన్ రంజిత్‌రెడ్డి మోసాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2021లో కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా శిక్ష తప్పదని భావించిన అతడు, కోర్టు ఆవరణలోని బాత్రూంకు వెళ్లి అక్కడ నుంచి పరారయ్యాడు. అప్పటి నుంచి రంజిత్‌రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
సిమ్‌లు, అడ్రెస్ మార్చి: పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు రూపం మాత్రమే కాదు, సిమ్ కార్డులు, అడ్రస్ తరచూ మారుస్తూ వచ్చేవాడు. ఒకేచోట ఎక్కువకాలం ఉండేవాడు కాదు. తనతోపాటు కుటుంబసభ్యులు ఉపయోగించే ఫోన్లు, సిమ్‌కార్డులను సైతం పూర్తిగా మార్చేశాడు. బంధువులు, స్నేహితులు ఏ ఒక్కరికీ అందుబాటులో ఉండేవాడు కాదు. దీంతో పోలీసుల నుంచి తప్పించుకున్నానులే అని ధీమాగా ఉన్నాడు.
ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. నిందితుడు ఉపయోగించిన ఫోన్ నంబర్ల ఆధారంగా ప్రయత్నించి, అతడి జీ-మెయిల్‌ను ట్రాక్ చేశారు. తద్వారా అతడు ఒక ఫోన్ నంబర్‌తో తరచూ మాట్లాడుతున్నట్టు నిర్దారించారు. దాని ఆధారంగా నిందితుడి ఆచూకీ లభించింది. దీంతో శనివారం రంజిత్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని మహంకాళి పోలీసులకు అప్పగించారు.
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్ - అలర్ట్ కావడంతో డబ్బు సేఫ్
పెళ్లి పేరుతో దగ్గరై డబ్బులు లాగేస్తారు - గట్టిగా అడిగితే ఎదురు కేసులు