ETV Bharat / state

ఆరేళ్ల కిందటి ఫొటో ఆధారం - సిగరెట్​ కోసం మాస్క్ తీయగానే చుట్టుముట్టిన పోలీసులు - HYDERABAD MAN MISSING CASE TRACED

ప్రేమపెళ్లి చేసుకున్నారు, కానీ పెళ్లైనప్పటి నుంచి తరచూ గొడవలు ఆపై అతడు ఏం చేశాడంటే!

Banjara Hills Police Traced Missing Case in Telangana
Banjara Hills Police Traced Missing Case in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2024, 5:26 PM IST

Banjara Hills Police Traced Missing Case in Telangana : అతడు అదృశ్యమై వంద రోజులైంది. పోలీసుల దగ్గర ఆరేళ్ల కిందటి ఛాయాచిత్రం మాత్రమే ఉంది. కానీ తప్పిపోయిన వ్యక్తి దగ్గర ఎటువంటి మొబైల్ అందుబాటులో లేదు. అసలు అతడ్ని పట్టుకోవడానికి పోలీసు దగ్గర సరైన ఆధారాలేమీ లేవు. అదృశ్యమైన వ్యక్తి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు తీసుకొన్న బంజారాహిల్స్‌ పోలీసులు అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ కోసం సాంకేతికత ఆధారంగా పట్టుకున్నారు. అతని కదలికలపై నిఘా పెట్టి సోమవారం అదుపులోకి తీసుకొన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : ఆరు సంవత్సరాల కిందట షౌకత్‌నగర్‌కి చెందిన షేక్‌ ఫిరోజ్‌(42) రాధికను పెద్దలను కాదని ప్రేమపెళ్లి చేసుకున్నాడు. తను నందినగర్‌కి మారిపోయారు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. వారిద్దరి మధ్యలో పెళ్లైనప్పటి నుంచి తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో పెద్దలు చాలా సార్లు వారికి సర్ధి చెప్పేవారు. కొన్నిసార్లు పోలీస్ స్టేషన్​కు వస్తే పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించేవారు. భార్యతో గొడవలు పెరగడంతో ఫిరోజ్‌ సెప్టెంబరు 1న ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. భర్త వస్తాడని చూసినా తిరిగి రాకపోవడంతో సెప్టెంబరు 4న భార్య బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఫిరోజ్‌ ఫోన్​ అందుబాటులో లేదు.

ఏడేళ్ల కిందట అదృశ్యమైన బాలిక - భర్త, కుమారుడితో తల్లిదండ్రుల చెంతకు

ఆరేళ్ల కిందటి ఫొటోతో కేసు ఛేదించారు : అతడి ఆరేళ్ల కిందటి ఫొటోనే ఆమె వద్ద ఉంది. దాని ఆధారంగానే ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. బంజారాహిల్స్‌ ఎస్సై కోన రమేష్‌ నిందితుడి పాత ఫోన్ నెంబర్ ఆధారంగా అతడి స్నేహితుల వివరాలను తీసుకున్నారు. ఫిరోజ్‌ కొత్త ఫోన్​ను ఆదివారం ట్రాక్‌ చేసి తను వైజాగ్‌లో ఉన్నట్లు గుర్తించారు.

ఆ తర్వాత ఆదివారం రాత్రి ఫిరోజ్‌ వైజాగ్‌ నుంచి సికింద్రాబాద్‌ వచ్చి మెట్రో రైలులో వెళ్తుండగా పోలీసులు అతడ్ని వెంబడించారు. యూసుఫ్‌గూడలో దిగి రహ్మత్‌నగర్‌ వైపు వెళ్తుండగా పీజేఆర్‌ విగ్రహం సమీపంలో ఫిరోజ్‌ ధూమపానం కోసం మాస్క్‌ తీశాడు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కర్నూలు జిల్లాలో బాలికల అదృశ్యం - ఎక్కువగా ఆ కారణంతోనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.