ETV Bharat / state

ఇలాంటి 'తెనాలి' గ్యాంగ్ మీ ఇంటికీ రావొచ్చు - చెప్పిందల్లా గుడ్డిగా నమ్మారో మీకు మిగిలేది గుండు సున్నే! - POLICE ARRESTED TWO CHEATERS

నరదిష్టి పేరుతో ప్రజల నుంచి డబ్బులు, నగలు దోచేస్తున్న ఇద్దరు కిలేడీలు - ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా మోసాల పర్వం - ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

Women who Deceive with superstitions
Women who Deceive with superstitions (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 26, 2024, 8:00 AM IST

Women who Deceive with superstitions : నుదుట పెద్ద బొట్టు పెట్టుకొని, దైవత్వం అంతా ముఖంలో, వస్త్రధారణలో కనిపించేలా అలంకరించుకుని ఇంటింటికీ తిరిగి నరదిష్టి ఉంది, తొలగిస్తామని నమ్మించి ఇంట్లో ఉండే విలువైన సామగ్రి, నగదును తెప్పించి మూట కట్టిస్తారు. పూజ చేస్తున్నట్లుగా నటిస్తూనే ప్రజల సొమ్మును దోచేస్తున్న ఇద్దరు మహిళలను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

నరదిష్టి ఉందని మాయమాటలు చెప్పి : బంజారాహిల్స్‌ డీఐ బషీర్‌ అహ్మద్‌ కథనం ప్రకారం మాదాపూర్‌లో ప్రీస్కూల్‌ నిర్వహిస్తున్న చిట్టినేని కరుణ అనే మహిళ బంజారాహిల్స్‌ రోడ్‌ నం.7లో నివాసముంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఇద్దరు అపరిచిత మహిళలు ఆమె ఇంటికి వచ్చారు. నరదిష్టి ఉందని ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మించి పూజ చేయాలంటూ నిమ్మకాయ, మిర్చి, ఉప్పు, బియ్యం, చీరతో పాటు రూ.లక్ష నగదును తీసుకొని రమ్మన్నారు. ఆ ఉపాధ్యాయురాలు వారికి రూ.70 వేలు ఇవ్వగా, వాటిని సంచిలో మూటకట్టినట్టుగా ఆమెకు చూపించారు.

పూజలు చెస్తున్నట్లు నటిస్తూ రూ.70 వేలకు కుచ్చుటోపీ : పూజలు చేస్తున్నట్లు నటిస్తూ రూ.70 వేలను కాజేశారు. అరగంట పూజ చేసి, తాము వెళ్లిన తరువాత చీర ధరించాలని, డబ్బులు తీసుకోవాలని బాధితురాలిని నమ్మించి అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. వారు వెళ్లిన తరువాత చూడగా నగదు కనిపించలేదు. శ్రీనగర్‌కాలనీలో నివసించే పద్మ కొండల వద్ద రూ.51 వేలు, జూబ్లీహిల్స్‌ డాక్టర్‌ ఆర్‌.ఎన్‌.సుబ్బారెడ్డి నివాసంలో రూ.లక్ష, సుజీత్‌ నారాయణ్‌ ఇంట్లో రూ.లక్ష, పంజాగుట్టలో టీచర్​గా పని చేస్తున్న రమా గుప్తా వద్ద రూ.లక్ష కాజేశారు. నిజామాబాద్‌ జిల్లాలోని జక్రాన్‌పల్లిలో నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్‌ చేశారు.

తస్మాత్​ జాగ్రత్త : ఇంద్ర సినిమాలో బ్రహ్మానందం అండ్ గ్యాంగ్ 'మీది తెనాలే, మాది తెనాలే' పేరుతో మోసం చేసినట్లుగా, ఇలాంటి గ్యాంగ్​లు నరదిష్టి పేరు చెప్పి బోల్తా కొట్టిస్తున్నాయి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నిండా ముంచేస్తున్నాయి. పూజలు, మంత్ర తంత్రాల పేరుతో డబ్బులు అడిగే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా తమ ప్రాంతాల్లో సంచరిస్తే వెంటనే దగ్గర్లోని ఠాణాకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

వింత ఆచారం- కీడు వచ్చిందనే అనుమానంతో గ్రామాన్ని ఖాళీ చేసిన గ్రామస్థులు - Superstitions in the village

Strange tradition in Jagtial : గ్రామంలో వింత ఆచారం.. పాత దుస్తులు, చీపుర్లు పట్టుకుని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.