Awareness Program for Students on Drugs Use: విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పోలీస్ ఆధ్వర్యంలో మంత్రి సవిత సమక్షంలో వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో మాట్లాడుతూ అవగాహన సదస్సు వల్ల తెలుసుకున్న అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన 45 రోజుల్లోనే అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు.
డ్రగ్స్ వినియోగంపై జరిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించక పోవడం దురదృష్టకరమని మంత్రి సవిత అన్నారు. రాబోయే రోజుల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో డ్రగ్స్ వినియోగంపై 33,000 కేసులు నమోదు అయితే ఎక్కడ పరిష్కారం చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అనంతపురం ప్రభుత్వ వైద్యశాలలో చిన్నారి మిస్సింగ్ కేసును రెండు గంటల వ్యవధిలోనే చేదించి బాలికను తల్లిదండ్రులకు అప్పగించామని అన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా, భద్రంగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి కేవలం శవరాజకీయాలు చేసి తన పార్టీ ఉనికిని చాటుకుంటున్నాడని విమర్శించారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని, విచారణ చేస్తున్న కొద్దీ అప్పులు, అక్రమాలు బయటికి పడుతున్నాయని దుయ్యబట్టారు. ఎన్డీఏ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని మంత్రి సవిత అన్నారు.
శంకుస్థాపన చేసి 15 ఏళ్లు - ఇంకా పూర్తి కాని గుణదల ఫ్లైఓవర్ - Gunadala Flyover Construction
డ్రగ్స్ వినియోగంపై జరిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించక పోవడం దురదృష్టకరం. రాబోయే రోజుల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. గత ఐదేళ్ల జగన్ పాలనలో డ్రగ్స్ వినియోగంపై 33,000 కేసులు నమోదు అయితే ఎక్కడ పరిష్కారం చూడలేదు. ఇటీవల అనంతపురం ప్రభుత్వ వైద్యశాలలో చిన్నారి మిస్సింగ్ కేసును రెండు గంటల వ్యవధిలోనే చేదించి బాలికను తల్లిదండ్రులకు అప్పగించాం. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా, భద్రంగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.- సవిత, మంత్రి
ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల్లో అరుదైన కప్పలు - దేశంలోనే తొలిసారి - Rare Frogs Found in Eastern Ghats