Attack on AP CM YS Jagan FIR Noted: సీఎం జగన్‌పై రాయితో దాడి ఘటనపై అజిత్ సింగ్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎమ్మెల్యే వేలంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ సెక్షన్లతో కేసు నమోదు చేశారనే విషయాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి అజిత్ సింగ్ నగర్ పోలీసులు ఫిర్యాదు, స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు.
సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి కేసు దర్యాప్తు చేసేందుకు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సంఘటనా స్థలం పరిసర ప్రాంతాలను డ్రోన్‌తో రికార్డ్ చేశారు. పోలీసులు సీసీ ఫుటేజీ విజువల్స్‌ను సేకరించారు. దాడి ఘటనపై ఇప్పటికే విజయవాడ సీపీ ఈసీకి నివేదిక ఇచ్చారు. సీఆర్పీఎఫ్ పోలీసులను పహారాగా ఉంచారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోంది. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సీఎం జగన్‌పై దాడి ఘటన - వివరాలు కోరిన కేంద్ర ఎన్నికల సంఘం - EC ON JAGAN INCIDENT
నివేదిక అందించామన్న సీపీ: సీఎం జగన్ రోడ్‌షోలో భద్రతా వైఫల్యంపై ఈసీకి నివేదిక అందించినట్లు విజయవాడ సీపీ కాంతిరాణా టాటా వెల్లడించారు. దాడి ఘటన దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. 20 మంది సిబ్బందితో 6 బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుందని సీపీ పేర్కొన్నారు. ఇప్పటికే రాత్రి ఘటనా స్థలం పరిసరాల్లో సీసీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు. ఆ పరిసర ప్రాంతంలో సెల్‌ఫోన్ డేటా కూడా సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి అనుమానితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు పలు బృందాలుగా విడిపోయి, దాడి ఘటనకు కారకులైన వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
జగన్ త్వరగా కోలుకోవాలి - ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల ఆకాంక్ష - CONDEMNED ATTACK ON CM JAGAN