Artist Sreeja Yuva story : అభిరుచులను తల్లి నేర్పించే క్రమంలో ఆసక్తిగా నేర్చుకుంది. ఇంజినీర్, డాక్టర్ ఏం కావాలనే ఆలోచన వచ్చినప్పుడు దేశంలో చాలామంది ఉన్నారులే నాన్న నేను కళారంగం వైపు అడుగేస్తా అని స్పష్టంగా చెప్పింది. అందరి సహకారంతో అంచెలంచెలుగా ఎదుగుతూ తనదైన మార్క్ చాటుకుంటోంది. ఏదో అభిరుచి ఉండాలని ఆర్ట్ నేర్చుకునే స్థాయి నుంచి సింగపూర్‌లోని భారత హైకమిషన్‌కు మ్యూరెల్ రూపొందించిన 75 మంది బృందానికి ప్రాజెక్ట్ మేనేజర్‌గా వ్యవహరించే స్థాయికి ఎదిగింది.
ఇక్కడ అందంగా బొమ్మలేస్తున్న ఈ యువతి పేరు శ్రీజ కనుమూరి. హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది. తండ్రి రూరల్ పవర్ డిస్ట్రీబ్యూషన్ అండ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ వ్యాపారి. తల్లి సౌజన్య గృహిణి. చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసమంతా హైదరాబాద్లోనే సాగింది. డిగ్రీ మాత్రం సింగపూర్లో పూర్తి చేసింది. ఇంటర్ పూర్తైన తర్వాత నుంచి కళారంగంలో తనదైన ముద్ర వేయాలని బలమైన కోరిక మొదలైందని చెబుతోంది శ్రీజ.
18 Years Handicapped Man Story in Warangal : ఆదుకోండి సర్.. ఉపాధికి దారి చూపించండి..
కేవలం ఆర్ట్ వేయడమే కాదు. కూచిపూడి లాంటి పలు కళారంగాల్లోనూ ఆసక్తి కనబరుస్తోం దీ యువతి. ఆర్ట్ వేయడంలో విభిన్నరకాలు ఉంటాయని, వీలైనంత త్వరగా వాటిని అవగతం చేసుకుని అనుకరించేందుకు ప్రయత్నిస్తానని చెబుతోంది. తాను వేయగలిగే ఆర్ట్స్ గురించి ఇలా వివరిస్తోంది. చిన్నప్పటి నుంచి ఇందులో రంగ ప్రవేశం ఉన్న శ్రీజ గ్రాడ్యుయేషన్ అయ్యాక సింగపూర్‌లోనే ఉద్యోగం చేస్తుండేది.
ఆ సమయంలోనే భారత్ హైకమిషన్‌కు మ్యూరెల్ రూపొందించాలని అందుకోసం ఆయా దేశాల్లో ఉన్న భారతీయులకు అవకాశం కల్పించింది. అప్పటికే గ్యాలరీ మేనేజర్‌గా పనిచేస్తున్న ఈ యువతి ఆ టీమ్‌కు మేనేజర్‌గా ఉండడమే కాదు భారతీయత ప్రతిబింబించేలా మ్యూరెల్ను తయారు చేశారు. ఆ అనుభవం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెబుతోంది శ్రీజ. తనలో ఉన్న కళను అందరికీ పంచాలనే ఉద్దేశంతో సింగపూర్లో కొన్ని రోజులు బోధన చేసింది శ్రీజ. తర్వాత స్వదేశానికి వచ్చిన తర్వాత కూడా ఫ్రీలాన్సర్‌గా టీచింగ్ చేస్తోంది.
తానీ స్థాయిలో ఉండేందుకు ఉమ్మడి కుటుంబమే కారణమని చెబుతోంది శ్రీజ. చేసే ప్రతి పనిలో తోడు నిలుస్తారని చెబుతోంది. ఆర్టిస్ట్‌గా ఎదిగేందుకు గురువులు, మిత్రులతో పాటు కుటుంబ సహకారం తోడ్పడిందని అంటోంది శ్రీజ. ఆమెకు ఎంత వరకైనా దేనికైనా అండగా నిలుస్తామని చెబుతున్నారు శ్రీజ తల్లిదండ్రులు. తమ కుమార్తె ఈ స్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల అభిరుచులను తెలుసుకుని, వాటిని ఓ లక్ష్యానికి ముడిపెట్టి ప్రోత్సహిస్తే ప్రతి ఒక్కరూ అద్భుతాలు చేయగలరని శ్రీజతో పాటు ఆమె తల్లిదండ్రులు అంటున్నారు.
Vogue Italia : వోగ్ ఇటాలియాలో 'మనోళ్ల బొమ్మ'.. సరదాగా తీసిన ఫొటోకు గుర్తింపు