Arogyasree CEO Statement on People Will Get Treatment Through Arogyasree: ఆరోగ్యశ్రీ ద్వారా పేదలందరికీ వైద్యం అందుబాటులో ఉందని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ స్పష్టం చేశారు. ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోవచ్చని పేర్కోంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. సేవలకు అంతరాయం కలిగించొద్దన్న పిలుపునకు ఆస్పత్రుల యాజమాన్యాలు సానుకూలంగా స్పందిస్తున్నాయని ప్రకటనలో పేర్కోన్నారు. ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని అందులో స్పష్టం చేశారు.
గడిచిన రెండు రోజులుగా ఆరోగ్య శ్రీ కింద 13,836 మంది చికిత్స పొందారని వెల్లడించారు. 2023- 24 ఆర్ధిక సంవత్సరానికి 3,566 కోట్లు నెట్వర్క్ ఆస్పత్రుల ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు. 2024- 25 ఆర్ధిక సంవత్సరంలో మొదటి రెండు నెలల్లోనే 366 కోట్ల రూపాయలు నెట్వర్క్ ఆస్పత్రుల్లో జమ అయ్యాయని స్పష్టం చేశారు.
'ఇల్లు పీకి పందిరేశారు!' - నాడు, నేడు పనుల్లో అంతులేని నిర్లక్ష్యం - Nadu Nedu School Works
Aarogyasri talks fail: పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో తమ అసోసియేషన్‌లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేయనున్నట్లు ఆశా స్పష్టం చేసింది. అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీశా రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల కోసం చర్యలు తీసుకుంటుందని సీఈఓ చెప్పారు. గతంలోనూ ఇలాగే చెప్పినప్పటికీ బిల్లుల చెల్లింపులు జరగలేదని ప్రతినిధులు పేర్కొన్నారు.
'ఆరోగ్యశ్రీ కొత్త పథకం కాదు- బటన్ నొక్కటంలో ఆలస్యం ఎందుకు?' - Busireddy Narender Reddy Interview
రూ. 203 కోట్లు విడుదల: ఈ నేపథ్యంలో దిగొచ్చిన ప్రభుత్వం తాత్కాలికంగా రూ. 203 కోట్లు విడుదల చేసింది. బుధవారం సాయంత్రం మరోమారు ఆరోగ్యశ్రీ సీఈవోతో నెట్‌వర్క్ ఆసుపత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. పెండింగ్ బకాయిలు రూ.800 కోట్లు విడుదల చేయాలని కోరగా ప్రభుత్వం రూ. 203 కోట్లు మాత్రమే విడుదల చేయడంతో ఆరోగ్యశ్రీ సేవల బంద్‌ను కొనసాగిస్తున్నట్టు ఆశా ప్రతినిధులు తెలిపారు. అయితే, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాత్రం నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రస్తుతం రూ. 203 కోట్లు విడుదల చేశామని, పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ఆరోగ్యశ్రీ సేవలకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించామని ట్రస్ట్ వెల్లడించింది.