AQUA Farmers In AP: కలిసి ఉంటే కలదు సుఖం అన్న చందంగా రైతులంతా ఒకే తాటిపైకి వచ్చి తమ సమస్యకు పరిష్కార మార్గం కనుగొన్నారు. చేపలు, రొయ్యలు సాగుకు అవసరమైన నీటి సమస్యను అధిగమించారు. రైతులంతా సమైక్యంగా కలిసి ఈ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆక్వా రంగంలో పదేళ్లుగా సిరులు పండిస్తున్న ఏలూరు జిల్లా ఇంగిలిపాకలంక రైతుల గురించి కింది విధంగా తెలుసుకుందాం.
నాసిరకంగా టైగర్ రొయ్య సీడ్- నిండా మునుగుతున్న ఆక్వా రైతులు - Aqua Farmers Facing Problems
సాగునీటి పరిష్కార దిశగా ఆక్వా రైతులు: ఏలూరు జిల్లా మండవల్లి మండలం ఇంగిలిపాకలంకలో సుమారు 1500ఎకరాల్లో చేపల, రొయ్యల చెరువులు ఉండగా గతంలో నీరు లేక వేసవి కాలంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తద్వారా చెరువుల్లో ఉప్పు శాతం పెరిగిపోయి చేపల పెరుగుదల లేక నానా కష్టాలు పడ్డారు. నీటి ఎద్దడి వల్ల చెరువుల్లో ఒక్కోసారి నీటిని బయటకు తీస్తే మళ్లీ నీటిని తోడుకోగలమో లేదో అనే భయం రైతుల్లో ఉండేది. అదే సమయంలో ఊరిని ఆనుకుని ప్రవహించే చంద్రయ్య కాలువ నుంచి పెద్ద ఎత్తున నీరు కొల్లేరులోకి వృధాగా పోవడాన్ని గమనించిన రైతులు ఎత్తిపోతల, పంప్ హౌస్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తలా కొంత వేసుకుని 2014లో సుమారు 18లక్షల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకున్నారు. పంప్ హౌస్ నిర్మాణంతో సహా 7.5 హెచ్.పీ. సామర్థ్యంతో 6 మోటార్లను సైతం సమకూర్చుకున్నారు.
వైఎస్సార్సీపీ పాలనలో కుదేలైన ఆక్వా రైతు- ఆస్తులు అమ్ముకుని వలస బాట - Aqua Farmers Problems
''వివిధ అనుమతులతో పాటు తమ ప్రయత్నానికి అప్పటి ప్రభుత్వం సహకారం అందించడంతో సకాలంలో ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయింది. అవసరమైనప్పుడల్లా మోటార్లతో చంద్రయ్య కాలువలోని నీటిని తోడుకుని కాలువల ద్వారా చెరువులకు సరఫరా చేసుకుంటున్నాం. ఇ కనుంచి ఆక్వా సాగుకు వర్షం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని మా నమ్మకం'' - సుబ్బరాజు, ఆక్వారైతు
''ఇంగిలిపాకలంక ఎత్తిపోతల పథకం నుంచి ప్రస్తుతం 900 ఎకరాల చేపల చెరువులకు నీరందుతుంది. ఈ ఆయకట్టులోని రైతులు నీటి ఎద్దడి నుంచి గట్టెక్కి చెరువుల్లోకి నీటిని తోడుకుంటున్నాం. ఎత్తిపోతల పథకం నుంచి ఇంగిలిపాకలంక, నందిగామలంక వరకు సుమారు 3 కిలోమీటర్ల పరిధిలో నీటిని సరఫరా చేస్తున్నాం. సుమారు 300 మంది రైతులం ఈ ఎత్తిపోతల పథకంపై ఆధారపడి ఆక్వాసాగు చేసుకుంటున్నాం. విద్యుత్తు బిల్లును మాత్రం అంతా కలిసి చెల్లిస్తున్నాం'' - నాగేశ్వరరావు, ఆక్వారైతు