ETV Bharat / state

గత ప్రభుత్వం పాపమే విద్యుత్ చార్జీల పెంపు శాపం - కూటమి సర్కార్ భారీ షాక్ ఇచ్చింది : షర్మిల - YS SHARMILA ON ELECTRICITY CHARGES

విద్యుత్ ఛార్జీల విషయంలో గత ప్రభుత్వం చేసిన పాపాలను కూటమి సర్కార్ ప్రజల నెత్తిన మోపుతోందని ఆగ్రహం

YS_Sharmila
YS Sharmila (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2024, 5:07 PM IST

YS Sharmila on Electricity Charges : విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సిది పోయి, ఆ పాపపు పరిహారాన్ని కూటమి సర్కార్ ప్రజల నెత్తినే మోపుతోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. 18 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలు వసూళ్ల విషయంలో తప్పేం లేదని ప్రభుత్వం చెప్పుకోవడం దారుణమన్నారు. భారం మోపింది తాము కాదంటూ, ప్రజల మీదే ఆ మొత్తాన్ని మోపుతున్నారని మండిపడ్డారు. ఇది సర్దుబాటు కాదని, ఇది ప్రజలకు సర్దుపోటని ఎద్దేవా చేశారు.

5 నెలల్లోనే 18 వేల కోట్లా: విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం ప్రజలకు భారీ కరెంటు షాక్ ఇచ్చిందన్నారు. వైఎస్సార్సీపీ చేసింది పాపం అయితే , రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ పెడుతున్నది శాపమని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఏం సంబంధమని షర్మిల నిలదీశారు. ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే పడే అదనపు భారం ప్రజల నెత్తిన మోపుతారా అని ప్రశ్నించారు. 5 ఏళ్లలో వైఎస్సార్సీపీ భారం 35 వేల కోట్లు అయితే, 5 నెలల్లో కూటమి భారం 18 వేల కోట్లా అని నిలదీశారు.

సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలి: వైఎస్సార్సీపీకి మీకు ఏంటి తేడా లేదని ఆక్షేపించారు. వైఎస్సార్సీపీ 9 సార్లు ఛార్జీలు పెంచిందని, కూటమి అధికారంలో కొస్తే ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచమని, అవసరం అయితే 30 శాతం తగ్గించేలా చూస్తాం అని ఎన్నికల్లో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉంటే, తప్పు ఎవరు చేసినా ఆ భారాన్ని ప్రజలపై మోపొద్దనే చిత్తశుద్ది మీకుంటే వెంటనే రూ.18 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

పడుతున్న భారంపై నిధులు ఇవ్వాలని మోదీని అడగాలన్నారు. ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేస్తే ఊరుకోమని, కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోందని తేల్చిచెప్పారు. ప్రజల ముక్కు పిండి ట్రూఅప్‌ ఛార్జీల రూపంలో, అధిక కరెంటు బిల్లులు వసూళ్లు చేస్తున్నందుకు నిరసనగా రేపటి నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు.

విద్యుత్ కొనుగోలు సర్దుబాటు ఛార్జీలు - ప్రకటన జారీ చేసిన ఏపీఈఆర్‌సీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.