ETV Bharat / state

'నాడు మెగా - నేడు దగా' - ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగుల ఆందోళన - DSC Applicants Protest In ap

AP Unemployed Youth Protest for Mega DSC Notification : దగా డీఎస్సీ వద్దు - మెగా డీఎస్సీ కావాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు నిరసన బాట పట్టారు. నాడు మెగా డీఎస్సీ (DSC) అంటూ హామీ ఇచ్చిన జగన్‌ ఎన్నికల ముందు దగా DSC ఇచ్చారని మండిపట్టారు. నిరుద్యోగులను నిలువునా ముంచిన వైసీపీ సర్కార్‌కు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. 'మాకూ ఉంది ఓటు' - 'మీకూ ఉంది వేటు' అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

AP_Unemployed_Youth_Protest_for_Mega_DSC_Notification

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 8:39 PM IST

'మినీ డీఎస్సీ వద్దు - మెగా డీఎస్సీ కావాలి' లేదంటే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం : నిరుద్యోగులు

AP Unemployed Youth Protest for Mega DSC Notification : ఐదేళ్లుగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను ఊరిస్తున్న ప్రభుత్వం చివరకు ఆరు వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. దీనికి నిరసనగా 'దగా డీఎస్సీ వద్దు - మెగా డీఎస్సీ' కావాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. నెల రోజుల్లో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తాజాగా విజయనగరంలో D.Y.F.I ఆధ్వర్యంలో నిరుద్యోగులు నిరసన ర్యాలీ చేపట్టారు. మెగా డీఎస్సీ (DSC) ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు.

దగా డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ ప్లీజ్​- రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న నిరుద్యోగుల ఆందోళనలు

కలెక్టరేట్ వద్ద బైఠాయించి మినీ DSC వద్దు మెగా డీఎస్సీ కావాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల ముందు 23,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన సీఎం జగన్ నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేశారని ఆరోపించారు. ఏటా జాబ్ క్యాలెండర్, డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పి ఎన్నికలకు ముందు కేవలం 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

DSC Candidates Protest in Andhra Pradesh : జగన్ అధికారంలోకి రాగానే మెగా DSC ప్రకటిస్తానని దగా డీఎస్సీ విడుదల చేశారని నిరుద్యోగులు మండిపడ్డారు. మెగా డీఎస్సీ ఇవ్వాలంటూ కాకినాడ ధర్నాచౌక్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. 'మెగా డీఎస్సీ ముద్దు - జగన్‌ వద్దు' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పోస్టులు పెంచకపోతే జగన్​ను గద్దె దించటానికి సిద్ధమని హెచ్చరించారు.

అభ్యర్థులను జగన్ మోసం చేశారని అఖిల భారత విద్యార్థి సమాఖ్య, నిరుద్యోగ ఐకాస నేతలు మండిపడ్డారు. మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ లెనిన్ కూడలి వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేశారు. రాష్ట్రంలోని 40 లక్షల నిరుద్యోగులు వారి కుటుంబాలు రాబోయే ఎన్నికల్లో వైసీపీను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారని హెచ్చరించారు.

మెగా డీఎస్సీకి తిలోదకాలు - ఎన్నికల గుమ్మంలో మినీ డీఎస్సీతో 'జగన్నాటకాలు'!

AP DSC Notification 2024 : మెగా DSC ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విజయనగరంలో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తమను మోసం చేశారంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గురుజాడ గ్రంథాలయం నుంచి కలెక్టరేట్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద బైఠాయించి మినీ DSC వద్దు మెగా DSC కావాలని నినదించారు. ఎన్నికల ముందు 23 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేశారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతపురం టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. మెగా DSC వేయకుంటే సీఎం జగన్ ను ఇంటికి పంపడం ఖాయమని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు 6 వేల పోస్టులతో మరోసారి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన - జగన్​కు ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.