AP Student Pallavi Reddy Committed Suicide Patna NIT : నేటి కాలంలో చాలా మంది యువత చిన్నచిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రేమ విఫలమైందని ఒకరు, పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని మరొకరు, తల్లిదండ్రులు మందలించారని ఇంకొందరు. ఇలా వివిధ కారణలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఏదైనా విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఫలితంగా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలతో తమను నమ్ముకున్న తల్లిందండ్రులను విషాదంలోకి నెట్టేస్తున్నారు.
తాజాగా బిహార్లోని ఎన్ఐటీ పట్నా బిహ్తా క్యాంపస్‌లో ఏపీకి చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో సదరు యువతి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన పల్లవిరెడ్డి ఈసీఈ రెండో సంవత్సరం చదువుతుంది. శుక్రవారం రాత్రి తన స్నేహితురాళ్లు భోజనం చేసేందుకు బయటకు వెళ్లారు. ఆమె వారితో వెళ్లకుండా గదిలోనే ఉంది.
ఈ క్రమంలోనే డిన్నర్ ముగించుకొని స్నేహితులు వచ్చి చూడగా పల్లవిరెడ్డి ఉరేసుకొని కనిపించింది. వెంటనే వారు హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. దీనిపై సిబ్బంది పోలీసులు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ క్రమంలోనే యువతిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
విజయవాడలో విషాదం - ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి - Doctor Family Suicide in Vijayawada
Student Protest in NIT Patna : మరోవైపు పల్లవిరెడ్డి మృతితో క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళన దిగారు. ఎన్ఐటీ సిబ్బంది తీరుపై మండిపడ్డారు. ఈ ఘటనపై అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. ఈ కేసును పక్కదారి పట్టించేందుకు చూస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ విషయం తెలియడంతో ముగ్గురు విద్యార్థులు భయాందోళనకు గురై స్పృహతప్పి పడిపోయారు. వారిని ఆసుపత్రికి తరలించారు.
పల్లవిరెడ్డి ఆత్మహత్యపై పోలీసులు స్పందించారు. ఈ విషయంపై తమకు సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించామని తెలిపారు. విద్యార్థిని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు. యువతికి సంబంధించిన ఓ సూసైడ్ నోట్ లభించినట్లు వివరించారు. మృతదేహాన్ని పోస్డ్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతురాలి బంధువులకు సమాచారం ఇచ్చినట్లు వివరించారు. పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
వసతి గృహంలో వరుస ఆత్మహత్యలు- తల్లిదండ్రుల ఆందోళన - Student Suicide In Hostel Palnadu