AP POLYCET Counselling Date 2024 : ఏపీ పాలిసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియ మే 23వ తేదీ గురువారం నుంచి ప్రారంభం అవుతుందని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్, శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేస్తామని వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కార్యాలయంలో మంగళవారం పాలిసెట్ ప్రవేశాలకు సంబంధించిన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవేశాలకు సంబంధించిన విభిన్న అంశాలను చర్చించారు. అనంతరం సంబంధిత ప్రక్రియకు అవసరమైన ప్రణాళికను ఖరారు చేశారు.
ధృవపత్రాల వెరిఫికేషన్ మే 31వ తేదీ నుంచి జూన్ 5 వరకు : ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ, పాలిసెట్ ప్రవేశాలకు సంబంధించిన ఫీజు చెల్లింపు, తదితర ఆన్ లైన్ ప్రక్రియకు మే 24వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు పది రోజుల పాటు అవకాశం ఉంటుందన్నారు. ధృవపత్రాల వెరిఫికేషన్‌కు మే 27 నుండి జూన్ 3వ తేదీ వరకు ఎనిమిది రోజుల లోపు పూర్తి చేయవలసి ఉందన్నారు. ఐచ్ఛికాల నమోదుకు మే 31వ తదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు అవకాశం కల్పించామన్నారు. జూన్ 5వ తేదీన ఐఛ్చికాల మార్పునకు అవకాశం ఉంటుందని, అలాగే జూన్ 7వ తేదీన సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని కమీషనర్ నాగరాణి వివరించారు.
Polycet : భవిష్యత్‌కు బాట..! ఈ నెల 30 వరకు పాలిసెట్ దరఖాస్తు గడువు.. మే 10న పరీక్ష
జూన్ 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తరగతులు ప్రారంభం : జూన్ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 5 రోజుల లోపు ప్రవేశాలు ఖరారు అయిన విద్యార్ధులు ఆయా పాలిటెక్నిక్ కలాశాలల్లో వ్యక్తిగతంగా, ఆన్ లైన్ విధానంలోనూ రిపోర్టు చేయవలసి ఉంటుందన్నారు. అలాగే జూన్ 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తరగతులు ప్రారంభం అవుతాయని నాగరాణి పేర్కొన్నారు. ర్యాంకు కార్డులను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని, ప్రవేశాల కౌన్సిలింగ్‌కు సిద్దంగా ఉండాలన్నారు. పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,42,035 మంది విద్యార్ధులు ప్రవేశ పరీక్షకు హాజరుకాగా, 87.61 శాతం మేర 1,24,430 మంది అర్హత పొందారు. బాలికలు 56,464 మంది పరీక్షకు హాజరుకాగా, 89.81 శాతం మంది, బాలురు 85,561 మంది హాజరుకాగా 86.16 శాతం అర్హత గడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 82,870 పాలిటెక్నిక్ సీట్లు : అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు మొత్తం 267 ఉండగా, వాటిల్లో మొత్తం 82,870 సీట్లు అందుబాటులో ఉన్నాయని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్, శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. సమావేశంలో సాంకేతిక విద్య శాఖ సంయిక్త సంచాలకులు వెలగా పద్మారావు, అదనపు కార్యదర్శి ఎస్విఆర్కె ప్రసాద్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి రమణబాబు, ఛీప్ క్యాంప్ ఆఫీసర్ విజయకుమార్, ఉపసంచాలకులు విజయ బాస్కర్, నేషనల్ ఇన్ ఫర్ మేటిక్ సెంటర్ అధికారులు పాల్గొన్నారు.
Polycet: పాలిసెట్ ప్రవేశ పరీక్షలో మార్పులేంటో తెలుసా..
AP POLYCET 2023: ఏపీ పాలిసెట్ 2023 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి