AP Legislature Approves Seven Key Bills: రాష్ట్ర శాసనసభ 7 బిల్లులను ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2024కు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ సవరణ బిల్లు-2024ను శాసనసభ ఆమోదించింది. ఇద్దరికి మించి పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హత నిబంధనను ఎత్తివేస్తూ చట్ట సవరణ చేసింది. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ సవరణ బిల్లు-2024ను శాసనసభ ఆమోదించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక్ హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టిషనర్స్ చట్ట సవరణ బిల్లు-2024కు ఆమోదం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు-2024ను ఆమోదించింది. అటు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు-2024కు శాసనసభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ సోసైట్ సవరణ బిల్లు-2024నూ శాసనసభ అమోదించింది. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభను మంగళవారానికి వాయిదా వేశారు.
పోసానిపై ఫిర్యాదులు - 8 సెక్షన్లు నమోదు చేసిన సీఐడీ
గడిచిన ఐదేళ్లలో మహిళలపై అఘాయిత్యాలు 20.8 శాతం పెరిగాయి: అనిత