ETV Bharat / state Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 9 September 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Mon Sep 09 2024- జీఎస్టీ కౌన్సిల్ సమావేశం - 8 అంశాలపై ప్రతిపాదనలు చేసిన ఏపీ ప్రభుత్వం - ap PROPOSALS in GST COUNCIL MEETING

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By Andhra Pradesh Live News Desk

Published : Sep 9, 2024, 7:00 AM IST

Updated : Sep 9, 2024, 10:51 PM IST

10:50 PM, 09 Sep 2024 (IST)

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం - 8 అంశాలపై ప్రతిపాదనలు చేసిన ఏపీ ప్రభుత్వం - ap PROPOSALS in GST COUNCIL MEETING

AP PROPOSALS IN GST COUNCIL MEETING: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 8 అంశాలపై ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు ఏపీ తరపున ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతిపాదనలను కమిటీ ముందుంచారు. పేదలకు ఊరటనిచ్చేలా జీఎస్టీ వెసులుబాటు ఉండాలని, కీలక రంగాలకు ప్రొత్సహం ఇవాలని, ఏపీకి ప్రయోజనం వచ్చేలా కొన్ని అంశాలపై మినహాయింపులు కోరారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:15 PM, 09 Sep 2024 (IST)

బుడమేరు పటిష్టతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు - జియోమెంబ్రేన్ షీట్ల ద్వారా లీకేజ్‌లకు అడ్డుకట్ట - Budameru Canal Breach Works

Govt Taken Special Measures to Fill Breach on Budameru Canal: బుడమేరు డైవర్షన్ కాలువపై గండ్లు పడిన ప్రాంతాన్ని మరింత పటిష్ట పరిచేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గండ్లను బండరాళ్లు, మట్టితో పూడ్చిన జలవనరుల శాఖ దానిపై జియో మెంబ్రేన్ షీట్​తో పాటు 20 ఎంఎం మెటల్ రాళ్లను మరో పొరగా వేస్తోంది. అలాగే దానిపై టార్పాలిన్ షీట్లు వేసి ఆపై ఇసుక బస్తాలను వేస్తున్నారు. దిగువకు చుక్కనీరు కూడా సీపేజీ లేకుండా చూడాలన్న సీఎం ఆదేశాల మేరకు పనులు చేపట్టారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:13 PM, 09 Sep 2024 (IST)

వరద నుంచి బయటపడుతున్న కాలనీలు - 7 వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో క్లీనింగ్​ - Vijayawada Gradually Recovering

Vijayawada Gradually Recovering From Flood Water : వరద విలయం నుంచి విజయవాడ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. వరద నీటి నుంచి కాలనీలు క్రమంగా బయటపడుతున్నాయి. వరద తీసేసిన కాలనీల్లో పారిశుద్ధ్య పనులు జోరుందుకోగా ఆహారం, కూరగాయలు, నిత్యావసరాల పంపిణీ వేగంగా సాగుతోంది. మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:49 PM, 09 Sep 2024 (IST)

సీఎం చంద్రబాబు పిలుపునకు అనూహ్య స్పందన- వరద బాధితులకు విరాళాలు వెల్లువ - Huge Donations to CMRF

Donations from People to Help Flood Victims: వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలు, ప్రముఖులు, ఎన్నారైల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. విజయవాడ కలెక్టరేట్​లో సీఎం చంద్రబాబును కలిసి పలువురు విరాళాల చెక్కులను అందజేస్తున్నారు. దాతలకు సీఎం అభినందనలు తెలిపారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:41 PM, 09 Sep 2024 (IST)

ప్రింటింగ్ సెక్టార్​పై పిడుగు- నీటిలో నానుతున్న కోట్లాది రూపాయల పుస్తకాలు, పేపర్ బండిళ్లు - Floods Effect on Printing Sector

Vijayawada Floods Effect on Printing Sector: ముద్రణ రంగానికి పెట్టింది పేరు విజయవాడ. ప్రింటింగ్ ప్రెస్సులకు హబ్​గా ఉన్న విజయవాడ, వరదల దెబ్బకు అతలాకుతలమైంది. ఏడున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ రంగానికి వరదలు భారీ నష్టాలను మిగిల్చాయి. విజయవాడ శివారులోని సింగ్ నగర్, పాయకాపురం, ప్రకాశ్ నగర్, కండ్రిక, రాజరాజేశ్వరిపేటలో అత్యధికంగా ఉండే ప్రింటింగ్ ప్రెస్​లు తీవ్రంగా నష్టపోయాయి. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:17 PM, 09 Sep 2024 (IST)

గత ప్రభుత్వ తప్పులను సరిచేయాలి- సుద్దగడ్డ వాగు సమస్యకు పరిష్కారం చూపుతా: పవన్‌ కల్యాణ్ - Pawan Kalyan visit Flooded Areas

Pawan Kalyan visit Eleru Flood Affected Areas: ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద ప్రభావిత ప్రాంతంలో పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై కలెక్టర్‌తో మాట్లాడుతూనే ఉన్నానని తెలిపారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

06:14 PM, 09 Sep 2024 (IST)

చిన్నారుల పెద్ద మనసు - వరద బాధితుల కోసం పాకెట్ మనీ - SCHOOL CHILDREN HELP

AP People Help to Flood Victims: ఆంధ్రప్రదేశ్​లో వరద ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి అన్ని వర్గాల వారు సాయం చేస్తున్నారు. చిన్నా, పెద్దా, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా పాఠశాల చిన్నారులు తమ పాకెట్ మనీని విరాళంగా ఇస్తున్న వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

05:21 PM, 09 Sep 2024 (IST)

వరద కష్టాలు తీర్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాం- బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాం: సీఎం - CM Visit to Flood Affected Areas

CM Chandrababu Visit to Flood Affected Areas: గత పాలకుల పాపాలే ప్రజలకు శాపంగా మారాయని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరును పట్టించుకోకనే ఈ దుస్థితి తలెత్తిందన్నారు. బాధితులను ఆదుకోకపోగా ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ బురద జల్లుతోందని మండిపడ్డారు. విజయవాడ వరదముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

04:12 PM, 09 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం బలపడుతోంది: మంత్రి నిమ్మల - Prakasam Barrage Boats Incident

Prakasam Barrage Boats Incident: ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం బలపడుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. లంగర్ వేయకుండా పడవలను కావాలనే వదిలేశారని, బోటు యజమాని వైఎస్సార్సీపీ నేత కావడం మరింత అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇలాంటి దుర్మార్గపు పనులు చేసే చరిత్ర వైఎస్సార్సీపీ దేనని, ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేసి నిందితులను శిక్షిస్తామన్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:42 PM, 09 Sep 2024 (IST)

ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు- జలాశయాలకు పోటెత్తిన వరద - Heavy rains in Uttarandhra

Heavy rains in Uttarandhra: కుండపోత వర్షాలకు ఉమ్మడి విశాఖ జిల్లాలో జలాశయాలు ప్రమాదకర స్థాయికి చేరాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో రాకపోకలు స్తంభించాయి. మోకాళ్లు లోతు నీరు రావడంతో బయటకు రాలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:02 PM, 09 Sep 2024 (IST)

షిర్డీలో సాయిబాబా దర్శనంతో పాటు కేదార్‌నాథ్ దర్శనం- భారీగా తరలివస్తున్న భక్తులు - Sri Kedarnath Temple in shirdi

Sri Kedarnath Temple Darsham along with Sai Baba Darshan in Shirdi : షిర్డీలో సాయిబాబా దర్శనంతో పాటు కేదార్​నాథ్​ స్వామి వారి దర్శనం కూడా పొందవచ్చు. అది ఎలా అనుకునుంటున్నారా! షిర్డీలో గణేశ్​ ఉత్సవాలు నిర్వహించే సమర్థ ప్రతిష్ఠాన్​ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉత్సవాల్లో భాగంగా కేదార్​నాథ్​​ ఆలయ నమూనాతో ఆలయాన్ని నిర్మించింది. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులు మాత్రం కేదార్​నాథ్​కే వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకున్న అనుభూతిని పొందుతున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

02:17 PM, 09 Sep 2024 (IST)

వర్షాలపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష- సహాయక చర్యలపై దృష్టి సారించాలని ఆదేశాలు - Atchannaidu Review on Rains

Atchannaidu Review on Rains : రాష్ట్రంలో వర్షాలు, వరదలపై అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలని, నష్టం పూర్తిస్థాయిలో అంచనా వేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:07 PM, 09 Sep 2024 (IST)

మత్తు పదార్థాలకు అడ్డాగా పబ్బులు- వరుస దాడులతో హడలెత్తిస్తున్న న్యాబ్​ - TG NAB POLICE RAIDS IN PUBS

Telangana NAB Police Raids in PUBS : హైదరాబాద్‌లో వినోదం ముసుగులో మత్తు పదార్థాలకు చిరునామాగా మారిన పబ్‌లను దారికి తెచ్చేందుకు పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడ నుంచి వచ్చాయి? ఎవరి ద్వారా కొనుగోలు చేస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నారు. అక్కడ లభించిన ఆధారాలతో డ్రగ్స్ ముఠాలను గుర్తించి అరెస్ట్‌ చేసేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:05 PM, 09 Sep 2024 (IST)

వణుకు పుట్టిస్తున్న "హైడ్రా" దూకుడు - ఎఫ్​టీఎల్​ పరిధిలో విల్లాలు నేలమట్టం - Hydra Demolishes Villas in Dundigal

Villas Demolitions in Mallampet : హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు ఆక్రమణదారులకు వణుకు పుట్టిస్తున్నాయి. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులోని విల్లాలను హైడ్రా నేలమట్టం చేసింది. సుమారు 14 గంటల పాటు శ్రమించి కత్వా చెరువు ఎఫ్​టీఎల్‌లో నిర్ధారించిన 28 అక్రమ విల్లాల్లో 14 విల్లాలను పూర్తిగా కూల్చివేసింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:52 PM, 09 Sep 2024 (IST)

మున్నేరులో కన్నీటి ప్రవాహం- వరదలో కొట్టుకుపోయిన 'వివాహ' సంతోషాలు - Massive Loss by Floods in Khammam

Massive Loss Due to Floods in Khammam : తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో వరదల కారణంగా తీరని నష్ఠం జరిగింది. వివాహాలు జరిగిన కుటుంబాలు, జరగాల్సిన కుటుంబాలు భారీగా నష్టపోయాయి. పెళ్లికి సమకూర్చుకున్న కావాల్సిన వస్తువులు, సొమ్ములు పూర్తిగా వదదల్లో కొట్టుకుపోయాయి. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:32 PM, 09 Sep 2024 (IST)

'బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు వైఎస్సార్సీపీ నేతలవే'- అనుమానితుల కాల్​ డేటా విశ్లేషణ - PRAKASAM BARRAGE BOATS CASE

Officers Report to CM Chandrababu on Prakasam Barrage Boats Hit : ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న సంఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేశారు. ఈ సంఘటన వెనుక కుట్ర కోణం ఉందని పేర్కొన్నారు. బోట్లు రిజిస్ట్రేషన్​ నంబర్ల ఆధారంగా యాజమానులను గుర్తించామని నివేదికలో పేర్కొన్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:28 PM, 09 Sep 2024 (IST)

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్​పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు- స్పీకర్​ కార్యాలయానికి ఆదేశాలు - MLAS DISQUALIFICATION CASE

TG High Court on MLAs Disqualification Case : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

11:45 AM, 09 Sep 2024 (IST)

చంద్రబాబు అరెస్టుకు నేటితో ఏడాది - ఆ ఘటనతో తనకు తానే మరణశాసనం లిఖించుకున్న వైఎస్సార్సీపీ - One year of Chandrababu Arrest

Chandrababu Arrest One year : అవినీతి, అక్రమ సంపాదన కేసుల్లో ఏ1 జగన్ 2019లో తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు అధికారాంతం వరకు చంద్రబాబుకూ అవినీతి మకిలి అంటించేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఏపీ సీఐడీ ద్వారా నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో ఇరికించి అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. నాలుగున్నర దశాబ్దాలపాటు ప్రజాజీవితంలో ఉన్న నేతను ఏడు పదులకు పైబడిన వయసుగల వ్యక్తిని సరిగ్గా ఏడాది క్రితం అమానవీయ పరిస్థితుల్లో అరెస్టు చేసి జైలుకు తరలించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

11:43 AM, 09 Sep 2024 (IST)

ఊపిరి పీల్చుకున్న విజయవాడ - విపత్తు వేళ ప్రభుత్వం స్పందనపై ప్రజల హర్షం - Relief Operations in Vijayawada

Relief Works in Vijayawada : బుడమేరు వరద ఉద్ధృతి తగ్గడంతో విజయవాడ ఊపిరి పీల్చుకుంటోంది. వారం రోజులుగా నీటిలో నానుతున్న కాలనీలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. నీటి నుంచి బయటపడిన కాలనీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. బాధితులకు ప్రభుత్వం 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

11:02 AM, 09 Sep 2024 (IST)

అల్లూరి జిల్లాలో విరిగిపడిన కొండచరియలు - ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు - Landslides in Alluri District

Landslides in Alluri District : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గల్లంతు అయ్యారు. వీరి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:44 AM, 09 Sep 2024 (IST)

ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు - పూర్తిస్థాయి నీటిమట్టానికి జలాశయాలు - Heavy Rains in Uttarandra

Heavy Rains in Uttarandra District : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రహదారులు జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పంట పొలాలు మునిగిపోయి రైతులు లబోదిబోమంటున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:22 AM, 09 Sep 2024 (IST)

వరదలతో మీ కారు డ్యామేజ్ అయ్యిందా? డోంట్​ వర్రీ- నష్టపరిహారం పొందండి ఇలా! - Vehicle Insurance for Flood Victims

Vehicle Insurance for Vijayawada Flood Victims : విజయవాడను ముంచెత్తిన వరద ధాటికి దాదాపు అన్ని వాహనాలూ ఏదో ఒక స్థాయిలో దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతులకు పూర్తి స్థాయిలో విడిభాగాలను మార్చడానికి బీమా సొమ్ము వస్తుందా, ఏ పాలసీ ఉంటే వస్తుంది, ఎలా, ఎప్పుడు క్లెయిమ్‌ చేసుకోవాలి అని తెలుసుకోవడంతో పాటు క్లెయిమ్‌ చేసుకునే ముందు పాలసీదారుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలూ కొన్ని ఉన్నాయి. అవేెంటో ఈ కథనంలో తెలుసుకుందాం. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:14 AM, 09 Sep 2024 (IST)

ముంపు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల పర్యటన - బాధితులకు బాసటగా మంత్రులు, ఎమ్మెల్యేలు - Ministers visit on Flood areas

Ministers Visit on Flood Areas in AP : విజయవాడ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించారు. సహాయచర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. బాధితుల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి హామీ ఇచ్చారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:03 AM, 09 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు అప్డేట్ - ఇవాళ్టితో పూర్తికానున్న పనులు - Prakasam Barrage Gates Works

Prakasam Barrage Works Updates : ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతు ప్రక్రియ ఇవాళ పూర్తి కానుంది. పడవలు ఢీకొనడంతో ధ్వంసమైన 3 గేట్ల వద్ద కౌంటర్‌ వెయిట్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. వాటిలో కాంక్రీటు వేసే పని పూర్తిచేస్తే లక్ష్యం నెరవేరుతుంది. కనీసం వారం రోజులు పట్టే పనుల్ని కేవలం 4 రోజుల్లోనే పూర్తిచేసేలా అధికారులు రేయింబవళ్లు సాహసోపేతంగా పనిచేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:26 AM, 09 Sep 2024 (IST)

ఉభయగోదావరి జిల్లాల్లో ఎడతెరపిలేని వర్షాలు - నీటమునిగిన పలు గ్రామాలు - Rains in joint Godavari District

Heavy Rains in joint Godavari District : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని గ్రామాలు నీటమునిగిపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:25 AM, 09 Sep 2024 (IST)

ఏపీకి 6,880 కోట్లు ఇవ్వండి - కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం మధ్యంతర నివేదిక - AP Floods Damage Report

AP Floods Damage Report : వరద విపత్తు వల్ల ఏపీకి రూ.6880 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. 7 జిల్లాల్లో సుమారు 11 లక్షల మంది ముంపు బారినపడినట్లు పేర్కొంది. ఇప్పటివరకు 33 మంది చనిపోయినట్లు తెలిపిన సర్కార్ మరో ఇద్దరు గల్లంతైనట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 4222 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని వివరించింది. భవిష్యత్ అంచనాలకు తగ్గట్లుగా ప్రకాశం బ్యారేజీకి ఎగువన మరో జలాశయం కట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. | Read More

Last Updated : Sep 9, 2024, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.