AP JAC Women Section Working Committee Meeting: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీనే రోజునే జీతాలు తీసుకోవడాన్ని తాము నమ్మలేకపోయామని ప్రభుత్వ మహిళ ఉద్యోగులు అన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏనాడూ 1వ తేదీన జీతాలు అందుకోలేదని తెలిపారు. అంతే కాకుండా రివర్స్ పీఆర్సీ ఇచ్చి ఉద్యోగులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని చెప్పడం సంతోషంగా ఉందని తెలిపారు. విజయవాడలోని రెవెన్యూ భవన్లో ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర నలూముల నుంచి మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గత ప్రభుత్వంలో ఉద్యోగులు జీతాలు టైం కు ఇవ్వాలని ఆందోళనలు చేయాల్సిన దుస్థితి తమకు తలెత్తిందని ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం చైర్ పర్సన్ లక్ష్మీ, సెక్రటరీ జనరల్ విజయలక్ష్మీ వాపోయారు. జగన్ అధికారంలోకి వచ్చాక పీఆర్సీ పేరుతో ఉద్యోగులను దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. ఐఆర్ కంటే ఫిట్ మెంట్ తక్కువగా ఉందని అలాగే సవరించిన పే స్కేల్‌ను కూడా బయట పెట్టలేదని తెలిపారు. కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 1వ తేదీనే జీతాలు తీసుకుంటున్నామని, ఉద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు.
పడవలో వెళ్లి - అమరావతి ఐకానిక్ టవర్లను పరిశీలించిన ఐఐటీ బృందం - IIT Madras Team Visit Amaravati
రాష్ట్రంలో ఉద్యోగులు 1వ తేదీన జీతాలు తీసుకుని సంవత్సరాలు గడుస్తున్నాయని పెర్కొన్నారు. అలాగే 11వ పీఆర్సీ కమిషన్‌ను రాజీమానా చేశారని, ఉద్యోగలు మనోభావాలు దెబ్బతినకుండా 12వ పీఆర్సీ కమిషన్ కూడా వేయాలన్నారు. రాష్ట్రంలో మహిళా ఉద్యోగులు ప్రతి ఏడాది పెరుగుతున్నారని, పని ప్రాంతాల్లో వారిపై లైంగిక దాడులను అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద షీ బాక్స్‌లు ఏర్పాటు చేయాలని వారు కోరారు.
గత ప్రభుత్వంలో ఉద్యోగులు జీతాలు సక్రమంగా ఇవ్వాలని ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. జగన్ అధికారంలోకి వచ్చాక పీఆర్సీ పేరుతో ఉద్యోగులను దారుణంగా మోసం చేశారు. కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 1వ తేదీనే జీతాలు తీసుకుంటున్నాము, ఉద్యోగులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. జగన్ హయాంలో రాష్ట్రంలో ఉద్యోగులు 1వ తేదీన జీతాలు తీసుకుని సంవత్సరాలు గడిచాయి. రాష్ట్రంలో మహిళా ఉద్యోగులు ప్రతి ఏడాది పెరుగుతున్నారు వారి పని ప్రాంతాల్లో లైంగిక దాడులను అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద షీ బాక్స్‌లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.- లక్ష్మీ, ఏపీ జేఏసీ మహిళా విభాగం చైర్ పర్సన్
సాంకేతిక అంశాలపై మేథోమధనం - ప్రతిభతో ఆలోచింపజేసిన విద్యార్థులు - Idea Tech at Andhra Loyola College
రైతులకు క'న్నీరు' - లంక భూముల్లో కుళ్లిన పంటలు - Lanka villages farmers problems