ETV Bharat / state

"ముంబయి సినీ నటి కేసు" - ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా - IPS OFFICERS BAIL PETITIONS

ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ

AP HC on IPS Officers Bail Petitions
AP HC on IPS Officers Bail Petitions (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 15, 2024, 3:45 PM IST

AP HC on IPS Officers Bail Petitions : ముంబయి నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ, న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు, మరో ఇద్దరు పోలీస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి బదిలీ చేశామని పీపీ లక్ష్మీనారాయణ ధర్మాసనానికి తెలిపారు.

కౌంటర్ వేసేందుకు మరికొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని పీపీ లక్ష్మీనారాయణ కోరారు. అనంతరం పీపీ విజ్ఞప్తితో విచారణను హైకోర్టు ఈ నెల 23కి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్లను పరిష్కరించే వరకు పిటిషన్లను అరెస్టు చేయవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.

ముంబయి నటి కేసు - కుక్కల విద్యాసాగర్‌కు రిమాండ్‌ - విజయవాడ సబ్‌ జైలుకు తరలింపు - Mumbai Actress Case Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.